ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అందం సాయి పల్లవి. అందంతోనే కాకుండా అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో హైబ్రిడ్ పిల్ల గా ముద్ర వేసేసింది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో తప్ప నటించని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మిస్సింగ్ లో ఉంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఈ సినిమా తరువాత ఒక్క సినిమా ఒప్పుకున్నది లేదు.. కనీసం ఒక వేడుక లోకాని, వేదిక మీద కానీ దర్శనమిచ్చింది…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన విషయం విదితమే. ఇక తాజాగా మరోసారి బాలయ్యకు శస్త్ర చికిత్స నిర్వహించారు…
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం దక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాకపోయేసరికి హీరోయిన్ గా తప్పుకొని పెళ్ళికి ఓకే చెప్పింది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఇక ఇటీవలే నిహారిక పబ్ ఇన్సిడెంట్‌తో వైరల్ గా…
రానా దగ్గుబాటి ఫస్ట్ మూవీ ‘లీడర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోక పోయినా రిచాకు మాత్రం మంచి అవకాశాలను అందించింది. ‘మిరపకాయ్’, ‘మిర్చి’, ‘నాగవల్లి’, ‘భాయ్’, ‘సారొచ్చారు’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉండగానే తన స్నేహితుడు జో లాంగెల్లా తో ప్రేమలో పడి, ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇక గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన…
‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు. ఎన్ని కథలు, కవితలు పొంగిపొరలినా, వాటికి నటన కూడా తోడయినప్పుడే రక్తి కడుతుందని పెద్దల మాట! ఇప్పటికీ నాటకం దేశవిదేశాల్లో సందడి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగునాట సైతం నాటకాన్ని బతికించే ప్రయత్నంలో కొందరు సాగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ‘సి.ఆర్.సి. కాటన్ కళాపరిషత్’ నాటకానికి వైభవం తీసుకువచ్చే దిశగా పయనిస్తోంది. ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి ఈ సంస్థకు గౌరవాధ్యక్షులు. విక్టరీ వెంకటరెడ్డి ఈ సంస్థ కన్వీనర్.…
‘6 టీన్స్, గర్ల్‌ఫ్రెండ్,పటాస్, ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్ శ్రీరామ్, అధినేత, సెల్ఫీరాజా’ వంటి సినిమాల్లో పలు సూపర్ హిట్ పాటలు రాసిన తైదల బాపు నిర్మాత కాబోతున్నాడు. తన పాటలతో యువతను ఆకట్టుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తైదల బాపు పుట్టినరోజు ఏప్రిల్ 25 పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు.…
తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో అదే పేరుతో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన హిందీ ‘జెర్సీ’ ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రంలో నటించనున్నారు. ‘జెర్సీ’ హిందీ మూవీ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో చెర్రీ తన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిని అభినందించారు. ‘జెర్సీ’ చిత్రంలో క్రికెట్ నేపథ్యంగా కనిపించినా, అందులో కేవలం…
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇటీవలే డీజే టిల్లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చిన్న చిన్న పత్రాలు చేస్తూ హీరోగా మారిన సిద్ధు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఈ చిత్రం తరువాత ఈ హీరో మంచి అవకాశాలనే అందుకుంటున్నాడు . అయితే హీరోగా ఒక్క హిట్టు పడేసరికి సిద్ధు బలుపు చూపిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదని…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా తన తండ్రి చిరుతో కలిసి ఆచార్య చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే ఆర్ ఆర్ఆర్…