Amala Akkineni: ఒకే ఒక జీవితం చిత్రంలో శర్వానంద్ కు అమ్మగా నటించి అందరిచేత కంటతడి పెట్టించింది అక్కినేని అమల. చాలా గ్యాప్ తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఆమె నటనను ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అమల కూడా పాల్గొంటుంది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. తాను సినిమాలకు గ్యాప్ ఎవ్వఁడు కారణం.. అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియాను చూసుకోవడం వలన టైమ్ దొరకడం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా చూశాకా తన తల్లి తనను గట్టిగా హత్తుకొని చాలా గర్వంగా ఉందని మెచ్చుకున్నారని తెలిపింది.
ఇక ఏదైనా మంచి పాత్రలు వస్తే తప్ప సినిమాలు చేయను అని చెప్పిన అమల నాగార్జునతో కలిసి నటిస్తారా..? అన్న ప్రశ్నకు లేదని చెప్పింది. “ఇంట్లో ఎప్పుడు ఆయనే కనిపిస్తారు.. ఇక సినిమాలో కూడా ఆయనతోనే అంటే కష్టం” అంటూ నవ్వేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటి అమల .. నవ మన్మథుడిని ఎప్పుడు చూస్తూ ఉండిపోవొచ్చు కదా అని కొందరు. మీ జంట బావుంటుంది.. ఇలాంటివేమీ పెట్టుకోకుండా మంచి సినిమా వస్తే చేయండి అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.