Simbu: ఈ కోలీవుడ్ హీరో టైమ్ మళ్లీ స్టార్ట్ అయ్యినట్టే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simbu: సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇందులో ఎవరు ఎప్పుడు హీరో అవుతారు.. ఎవరు ఎప్పుడు జీరో అవుతారు అనేది ఎవరు చెప్పలేరు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోలుగా మారిన వారు ఉన్నారు.. స్టార్ హీరోగా ఒక స్థాయికి ఎదిగి పాతాళానికి పడిపోయిన హీరోలు ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే నిలకడ లేనిది. ఎవరి టైమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఒక యువకుడు.. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. వరుస హిట్లు కొట్టి స్టార్ హీరోగా మారాడు. ఎన్ని వివాదాలు వచ్చినా తల వచ్చలేదు. కానీ జీవితం అనుకున్నట్లు ఉంటే దాన్ని జీవితం ఎందుకంటారు. వరుస ప్లాపులు.. లావు పెరిగాడంటూ ట్రోల్స్.. కెరీర్ అయిపోయిందంటూ విమర్శలు.. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా బంతిని ఎంత గట్టిగా కొడితే వెనక్కి అంతే వేగంతో వస్తుందో.. అలాగే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కష్టపడి శరీరాన్ని తనకు నచ్చినట్టుగా మార్చుకొని వచ్చి హిట్ అందుకున్నాడు. విమర్శల నోర్లు మాయించాడు.. అతడే.. కోలీవుడ్ యంగ్ హీరో శింబు.
మానాడు చిత్రంతో శింబు రీఎంట్రీ ఇచ్చాడు. ఎస్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. టైమ్ లూప్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత శింబు నటిస్తున్న చిత్రం ‘వెంధు తానింధాతు కాడు’. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15 న తమిళ్ లో రిలీజ్ అవుతోంది. ఇక ఇదే సినిమాను ది లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో తెలుగులో సెప్టెంబర్ 17 న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో శింబు కాటికాపరిగా, గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు. రెండు పాత్రల కోసం శింబు పడిన కష్టం ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోంది. ఇక ఇన్ సైడ్ టాక్ ఏంటంటే.. ఈ కుర్ర హీరో ఈ సినిమాతో గట్టిగానే కొట్టేట్టు ఉన్నాడట. ఇక ఈ విషయాన్నీ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా చెప్పడం విశేషం.. శింబు నీ టైమ్ స్టార్ట్ అయ్యింది అంటూ ట్వీట్ చేయడంతో అభిమానులు శింబు ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు