Sunitha: నా రెండో పెళ్లి గురించి మీకెందుకు.. సంస్కారం ఉంటే మాట్లాడరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన వాయిస్ తో ఎంతోమంది సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసేస్తుంది. ఇక ఆమె ఆహార్యం, నవ్వు తెలుగింటి ఆడపడుచు అంటే ఇలానే ఉండాలి అని అనిపించేలా ఉంటుంది. ఆమె అంటే అందరికి అభిమానమే. అయితే సునీత రెండో పెళ్లి విషయంలో మాత్రం చాలామంది ఆమెను వ్యతిరేకించారు. ఈ వయస్సులో నీకు పెళ్లి అవసరమా..? అంటూ ట్రోల్స్, మీమ్స్ వేసి విమర్శించారు. వాటిని పట్టించుకోకుండా సునీత గత ఏడాది రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకొంది. ఇప్పటికి ఆమెపై ట్రోల్స్ మాత్రం తగ్గలేదు. డబ్బు కోసం చేసుకుందని, సుఖం కోసం చేసుకుందని నానా మాటలు అంటూనే ఉన్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ ట్రోల్స్ పై స్పందించింది.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీతకు ఇదే ప్రశ్న ఎదురైంది. మీ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి.. మీ రెండో పెళ్లి గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటి గురించి మీరేమంటారు అని అడుగగా.. ఆమె ఎమోషనల్ అవుతూ “మీరందరూ అంటూ ఉంటారు కదా.. చిత్ర గారి తరువాత 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది అని, చాలామందికి ఎంటర్ టైన్మెంట్ కు కారణం నేను కారణమని అంటూ ఉంటారు. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు నా పర్సనల్ జీవితంపై ఎందుకు ఫోకస్ పెడుతున్నారు. ఎందుకు నా పర్సనల్ లైఫ్ గురించి గొంతు లేపుతున్నారు. సంస్కారవంతుల లక్షణం ఏంటంటే.. ఒక మనిషిని ఒక మాట అనేముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. వాళ్ళేం మాట్లాడుతున్నారో..” అంటూ కంటనీరు పెట్టుకుంది. ప్రస్తుతం సునీత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!