హిందూ ధర్మం సనాతన ధర్మం.. మానవ సేవే మాధవ సేవ.. సాటి మనుషులకు, సమాజానికి సేవ చేస్తే, ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతోందన్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ మరియు ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుందన్నారు..
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం 200వ మెట్టు వద్ద గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భక్తుడు మృతి చెందాడు. మృతి చెందిన భక్తుడు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ (50)గా గుర్తించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేశ్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కావలి మండలం రుద్రకోట జాతీయ రహదారిపై…
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు అని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుపతి వేదికగా 2వ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి ప్రారంభించారు చంద్రబాబు.. మూడు రోజుల పాటుఈ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో కొనసాగనుంది.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 55 కోట్లు మంది కుంభమేళాలో పవిత్రమైన స్నానాలు ఆచరించారు.. అంటే,…
గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ నిన్న జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన…
నేడు తిరుపతికి ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌లు తిరుపతికి రానున్నారు. తిరుపతిలో జరగనున్న రెండవ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో ప్రారంభోత్సవంకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మూడు రోజులు నిపుణుల నేతృత్వంలో దేవాలయాలపై చర్చలు, ప్రదర్శనలు, వర్క్ షాపులు జరగనున్నాయి.…
CM Chandrababu: టెంపుల్ సీటి తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో జరగనుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శనను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రమోద్ సావంత్ లు పాల్గొననున్నారు.
డబ్బుల కోసం ఓ భర్త సైకోగా మారిపోయాడు.. నువ్వు ఏదైనా చేసి.. చివరకు.. నాకు మాత్రమే చూపించాల్సిన నీ అందాలను.. ఆన్లైన్లో చూపించూ.. న్యూడ్ కాల్స్ చేసి.. మొత్తానికి డబ్బులు కావాలి అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.. భార్యను న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్నాడు ఓ సైకో భర్త... ఆ వేధింపులను తట్టుకోలేక.. తన భర్త నుండి రక్షణ కల్పించాలని మీడియా ముందుకు వచ్చింది తిరుపతికి చెందిన శ్రీదేవి అనే మహిళ
TTD Big Alert: తిరుమల కొండకు వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులను ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
ఆ ఎమ్మెల్యే పేరుకే తప్ప… పరపతి లేకుండా పోయారా? ఆయన సిఫారసులను కనీసం పట్టించుకునే వాళ్లు లేకుండా పోయారా? నేను లోకల్ అంటున్నా… పోవయ్యా… పోపో… అంటున్నారా? అదే స్థానంలో అంతకు ముందున్న ఎమ్మెల్యే చక్రం తిప్పగా… ఇప్పుడు ఈయనేమో… చక్రం కాదు కదా… కనీసం చెయ్యి కూడా తిప్పలేక గోవిందా… నువ్వే దిక్కు అంటున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన బాధ? ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత గురించి ప్రత్యేకంగా…
జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్‌పై ఓ మహిళ కోటి ఇరవై డబ్బులు ఇవ్వాలంటూ ఆరోపణలు చేయడం, వీడియోలు బయటకు రావడం సంచలన రేపాయి.2013 లో తీసుకున్న డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేశానని కాని ఇచ్చేసిన డబ్బులను, మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ నేతలు ఆ మహిళతో కలసి కుట్ర పన్ని ఇలా చేస్తున్నారంటూ తిరుపతి పోలీసులు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు..