TDR bonds: తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీకి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ.. దీని కోసం రేపు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు మున్సిపల్ శాఖ అధికారులు.. మాస్టర్ ప్లాన్, రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను త్వరితగతిన జారీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు మున్సిపల్ శాఖ అధికారులు.. రేపు ఉదయం నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ లో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత పాల్గొననున్నారు.. టీడీఆర్ బాండ్ల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేయించడం, ఇతర సమస్యలు పరిష్కరించడం కోసం స్వయంగా డ్రైవ్ లో పాల్గొననున్నారు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్.. టీడీఆర్ బాండ్లు పొందాల్సిన వారు స్పెషల్ డ్రైవ్ కు తగిన డాక్యుమెంట్లతో హాజరుకావాలని మున్సిపల్ శాఖ సమాచారం చేరవేసింది.. కాగా, టీడీఆర్ బాండ్ల జారీలో ఆలస్యం లేకుండా నిర్దిష్టమైన గడువు విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. టీడీఆర్ జారీలో మాన్యువల్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు.. ఇక నుంచి టీడీఆర్ బాండ్ల ధరఖాస్తులు, బాండ్ల జారీ కూడా ఆన్‌లైన్‌లో చేయాలని మున్సిపల్‌శాఖ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం