తిరుమలలో దంపతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Wives Fight: చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని చిత్తూరు కండ్రిగలో భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. చిత్తూరు కండ్రిగకు చెందిన విశ్రాంత ట్రాన్స్‌కో డీఈ సుబ్రహ్మణ్యం గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉండగా.. ఇటీవల పరిస్థితి విషమించడంతో రెండో భార్య జానకి, తనయుడు నవీన్ కుమార్ స్విమ్స్‌కు తీసుకెళ్లారు.
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి.. అయితే, కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు..
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఇవాళ కూడా ఎన్నికల ప్రక్రియ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్
Tirupati: తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 3) ఉదయం 11 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరగనుంది. భూమన అభినయ రెడ్డి రాజీనామాతో ఖాళీగా మారిన ఈ పదవికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్ష కూటమి ఈ స్థానంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, క్యాంప్ రాజకీయాలు ముదిరాయి. దీనితో గత మూడు రోజులుగా తిరుపతిలో…
శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. అయితే ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో ఉంది. ట్రయల్ రన్లో భాగంగా సోమవారం 5 వేల మసాలా వడలను టీటీడీ సిబ్బంది భక్తులకు వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని తెలుస్తోంది. శ్రీవారి భక్తులకు కొన్నేళ్లుగా…
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. సోమవారం రాత్రి హెచ్ బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరించింది. చిరుతను చూసి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. యూనివర్సిటీ సిబ్బంది వెంటనే పోలీస్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు హెచ్ బ్లాక్ ప్రాంతంలో చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read: Australian Open 2025: క్వార్టర్‌ఫైనల్‌కు సినర్.. ఎదురులేని స్వైటెక్! కుక్కలు, దుప్పిల కోసం…
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగిశాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు…