Homestay Gang War: తిరుపతిలో హోం స్టేల గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసి బస్ స్టాండ్ సమీపంలోని చింతలచేనులో రెండు హోం స్టే’ల మధ్య ఘర్షణ జరిగింది. ‘డెక్కన్ సూట్స్ హోమ్ స్టే’ నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోం స్టే యాజమాన్యం దాడికి దిగింది. డెక్కన్ సూట్స్ హోం స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణిందర్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక, గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు స్థానికులు.
Read Also: Canada: కెనడాలో భారతీయుడు హత్య.. నిందితుడు అరెస్ట్
అయితే, ఒక హోం స్టేకు వచ్చే కస్టమర్లను మరో హోం స్టే వాళ్లు లాక్కెళుతున్నారని ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఇక, దాడికి పాల్పడిన 7 మందిని ఈస్ట్ పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనతో హోం స్టేలోని శ్రీవారి భక్తులు, స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురైయ్యారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.