Venkaiah Naidu: నేతల భూతులు వినలేక.. గత ఎన్నికల్లో ఓట్లు వేసి ఓడించారు..
- గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు..
- వారు ఎవరో మీకే తెలుసన్న వెంకయ్యనాయుడు..
- ప్రజల అందరూ ఆ నేతల భూతులు వినలేక..
- పోలింగ్ భూత్‌లోకి వెళ్లి ఓటు వేసి ఓడించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయి.. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందారన్న ఆయన.. నువ్వే నా.. మేం అంతే అంటూ మరికొద్దిమంది భూతులు మాట్లాడుతున్నారు.. గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు.. ప్రజల అందరూ ఆ నేతల భూతులు వినలేక.. పోలింగ్ భూత్‌లోకి వెళ్లి ఓటు వేసి ఓడించారు.. భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది.. బలమైనది అని పేర్కొన్నారు.
Read Also: Rajinikanth : ‘జైలర్ 2’ షూటింగ్ అప్‌డెట్..
Also Read
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్పై సంచలన వ్యాఖ్యలు
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. భాషను జాగ్రత్తగా వాడాలి అని సూచించారు వెంకయ్య నాయుడు.. ఇక, ఉచిత పథకాలకు నేను వ్యతిరేకం… చదువు, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి.. కానీ, ఉచితపథకాల వల్ల నష్టం తప్ప లాభం ఉండదు అన్నారు.. మరోవైపు, ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల సమయం ఆదా, ఖర్చు ఆదా అవుతుందన్నారు.. ఎన్నికల ఖర్చు వేలకోట్లుకు చేరింది.. నేను ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ప్రజలు విరాళంగా కొంత డబ్బులు ఇచ్చారు.. నేను రూపాయల జేబులో నుండి తీయలేదు.. ఒక్క రూపాయి జేబులో వేసుకోలేదని గుర్తుచేసుకున్నారు.. రాజకీయాల్లో కులం, ధనం, మతం లేకుండా చేయాలి.. కానీ, కులం, డబ్బులు, క్రిమినల్స్ కి ఇప్పుడున్న పార్టీలు ప్రధాన్యత ఇస్తున్నాయన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..
తాజావార్తలు
-
Volvo EX90 India Launch: భారత్లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!