తిరుమల అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలపకుండానే ఓ వ్యక్తి దూసుకెళ్లాడు. అతడిని నిలువరించేందుకు యత్నించిన సమయంలో ద్విచక్ర వాహనంతో భద్రతా సిబ్బందిపై దూసుకెళ్లాడు. ఘాట్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టాడు. చివరకు తిరుమల లోని జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
సింగాలగుంటకి చెందిన అమీర్ అంజద్ ఖాన్ అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని నిలపకుండానే దూసుకెళ్లాడు. అమీర్‌ను అడ్డుకునేందుకు యత్నించిన సమయంలో భద్రతా సిబ్బందిపైకి ద్విచక్ర వాహనంతో దూసుకెళ్లాడు. ర్యాష్ డ్రైవింగ్‌తో ఘాట్ రోడ్డులోని పలు వాహనాలను ఢీకొట్టాడు. చివరకు జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. నెత్తిన ముస్లిం టోపీ ధరించి.. భద్రతా వళ్లయాని తప్పించుకొని తిరుమలకు ఎందుకు వచ్చావని అమీర్‌ను విజిలెన్స్ సిబ్బంది విచారిస్తోంది.