తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈరోజటితో ముగియనున్నాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనున్నాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని…
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు…
పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. మా వాళ్లపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంచు మనోజ్.. నిన్న మోహన్బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన ఘటనలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. తన భార్య మౌనికతో కలిసి పీఎస్కు వచ్చిన మనోజ్.. తన అనుచరులు పళణి, వినాయకతో ఎంబీయూ సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్ పై ఫిర్యాదు చేయించారు..
శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం తిరుమలలో మరోసారి కలకలం రేపింది. నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్న కొందరిని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తు్న్నట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు ఇంటి దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం…
బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో సినీ నటుడు మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవ…
Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ…
తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తిరుమలకు వెళ్లాడు. కాలినడకన కొండపైకి వెళ్లిన ఆయన మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆస్ట్రేలియాతో బీజీటీ సిరీస్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నాడు.
తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం రేపుతుంది. టీటీడీ ఉద్యోగిపై దాడికి పాల్పడింది. సైన్స్ సెంటర్ వద్ద టీటీడీ ఉద్యోగి ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం.. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులే.. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేవారు.. గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలన్నారు.. చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు. భయం…
చాలా బాధాకరం అన్నారు సీఎం చంద్రబాబు.. తొక్కిసలాట వార్త మనసు కలచివేసిందన్న ఆయన.. శ్రీవారి సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు అని నా భావన.. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి తీసుకోదగ్గ చర్యలపై చర్చించాను.. మన చర్యల వల్ల దేవుని పవిత్రత దెబ్బ తినకూడదు.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే.. తిరుపతిలో దర్శన టోకెన్లు ఇవ్వడం కొత్త సంప్రదాయం.. ఇది కరెక్ట్ కాదని భక్తులు భావిస్తున్నారని తెలిపారు.. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు…