వైవీ సుబ్బారెడ్డికి టిటిడి చైర్మన్ కుర్చీపై ఆసక్తి లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిటిడి పాలకమండలి నియామకం ఎందుకు ఆలస్యమైంది? దాని వెనుక ఏదైనా కారణం ఉందా? చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగినా, ఎందుకు బ్రేక్ పడింది. కార్పొరేషన్ ల ప్రకటన రోజే…. టిటిడి అంశం కూడా తేలిపోతుందని భావించినా, అంచనాలు ఎందుకు తప్పాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ఇవాళో రేపో అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉంటే… ప్రభుత్వం మాత్రం పాలకమండలి నియామక ప్రకటన నిదానంగానే చేసే అవకాశం కనిపిస్తోంది. గత నెల 21వ తేదీకి వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి గడువు ముగిసి పోయింది. దీంతో మరోసారి వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలోనే పాలకమండలి ఏర్పాటవుతుందని భావించారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
కానీ, చైర్మన్ హోదాపై వై.వి.సుబ్బారెడ్డి ఆసక్తి చూపకపోవడం…, ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉండేందుకు ధార్మిక సంస్థ పదవి అడ్డుగా ఉండటం వంటి అంశాలతో… సుబ్బారెడ్డి ఎంపీ పదవి పైనే ఆసక్తి చూపారని సమాచారం. దీంతో పాలకమండలి నియామకం మొదట్లో బ్రేక్ పడినా… ఆ తర్వాత తిరిగి సుబ్బారెడ్డిని చైర్మన్ గా, మరోసారి 37 మంది సభ్యులతో పాలకమండలి నియామకం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆదివారం రోజున వై.వి.సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారన్న టాక్ కూడా నడిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ ప్రకటనలు చేస్తున్న సమయంలోనే టీటీడీ చైర్మన్ పదవి కూడా ప్రకటిస్తారని భావించారు. వైవి వర్గియులు కూడా సోషియల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెట్టేశారు.
కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేషన్ చైర్మన్ పదవి ప్రకటనలతో సరిపెట్టింది. అదేరోజు టీటీడీ చైర్మన్ ప్రకటన మాత్రం రాలేదు.ఒకవైపు మహిళలకు పెద్దపీట వేస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్ చైర్మన్ ల ప్రకటన చేస్తూన్న సమయంలో టిటిడి పాలకమండలి ప్రకటన చేస్తే అందరి దృష్టి అటు వైపుకి మళ్లే అవకాశం ఉంది. టిటిడికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అందరి దృష్టి పాలకమండలి వైపు మళ్లితే ప్రభుత్వం రెండేళ్లుగా చేస్తున్న కసరత్తు…. బూడిదలో పోసిన కన్నీరులా మారుతుందని ప్రభుత్వ పెద్దలు భావించినట్లు సమాచారం.
టిటిడికి పూర్తిస్థాయిలో పాలక మండలిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేసమయంలో 37 మంది సభ్యుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా అవకాశం కల్పించవలసి ఉంటుంది. అదే సమయంలో మహిళలకు 50 శాతం పదవులు కేటాయించే అవకాశం లేదు. ఎస్సీ ,ఎస్టీ, బీసీలకు పాలకమండలి లో పెద్దగా ప్రాతినిధ్యం ఉండే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. ఇవన్నీ కార్పొరేషన్ చైర్మన్ ల నియామకంలో ప్రభుత్వం పాటిస్తున్న జాగ్రత్తలను దెబ్బతీస్తుందని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. దీంతో కార్పొరేషన్ చైర్మన్ ల హడావుడి ముగిసిన తర్వాత టిటిడి అంశం తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!