దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు ధరలు పైపైకి పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక, ప్రతిపక్షాలు పెట్రోల్ ధరలను నిరసిస్తూ నినాదాలు, నిరసలు చేస్తున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ సీపీఐ తిరుపతిలో నిరసన తెలియజేసింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నారాయణ పాల్గోన్నారు. ఓ పెట్రోల్ బంకు వద్ద షర్టు విప్పేసి నిరసన చెప్పడమే కాకుండా ప్రధాని మోడీపైన, రాష్ట్రప్రభుత్వంపైన విమర్శలు సంధించారు. పెట్రోల్ ధరలు మోడీ గడ్డం పెరిగినట్టుగా పెరుగుతున్నాయని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచుతున్నాయని, జీఎస్టీ పరిధిలోకి చమురును తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమిళనాడు కంటే ఏడు రూపాయలు అధికంగా పెట్రోల్ ధరలు ఉన్నాయని నారాయణ పేర్కొన్నారు.
Read: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..