తిరుపతి నగరంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును రట్టు చేసారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో రహస్యంగా వ్యభిచార దందా కొనసాగుతుంది. వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మంగళవారం రాత్రి ఓ ఇంట్లో ఆసస్మికంగా దాడి చేసి నలుగురు విటులను అలాగే నిర్వాహకులను అరెస్టు చేసారు. దీని నిర్వహిస్తున్నవారు కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా గుర్తించారు. యువతుల ఫొటోలను సాయిచరణ్, అనిరుధ్ కుమార్ లు విటులకు పంపుతున్నట్లు తెలిపారు. బెంగుళూరు, గుడివాడ నుంచి యువతలు నగరానికి రప్పిస్తున్నారు. వీరి నుంచి మరీ కొంతమంది యువతులను రక్షించారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు. దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈస్ట్ సిఐ శివప్రసాద్ రెడ్డి.