తిరుమలలో జరుగుతున్న అసత్యప్రచారాలపై అధికారులు అప్రమత్తం అయ్యారు. టీటీడీపై నిరాధరమైన ఆరోపణలు చేస్తూన్న వారిపై విజిలెన్స్ అధికారులు కోరడా ఝూలిపిస్తున్నారు. టీటీడీ నిర్వహిస్తున్న కౌంటర్లు ప్రైవేటీకరణ చేస్తారంటూ.. కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగిందంటూ నిరాధరమైన ఆరోపణలు చేసిన వారిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, ఓ ప్రముఖ ఆన్ లైన్ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలపై కఠినమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.