తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేస్తున్నది. రేపటి నుంచి ఈనెల 15 వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతున్నది. ఇక రేపు సాయంత్రం 5:10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రేపు రాత్రి పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. 9 రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు…
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. నిన్నటి రోజున స్వామివారిని 28422 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 12058 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండీ ఆదాయం 2.36 కోట్లుగా ఉంది. అయితే ఈ నెల 5వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఆ కారణంగా 5వ తేదిన విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. 6వ తేదిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనుండగా…7వ తేది నుంచి…
శ్రీవారి దర్శనానికి TTD అనేక వెసులుబాటులు కల్పించింది. ఆర్థిక స్థోమత.. పరిచయాల ఆధారంగా తమకు వీలైన మార్గాన్ని ఎంచుకుంటారు భక్తులు. కాకపోతే వెసులుబాటులను లాభసాటి వ్యాపారంగా చూసేవారు కూడా కొందరు ఉన్నారు. ఈ విషయంలోనే విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా ఉండాలి. కానీ.. ఓ ఘటనలో TTD విజిలెన్స్ ఇచ్చిన ప్రకటన.. చర్చగా మారింది. ఆలయ పరిపాలనపై విజిలెన్స్కు అవగాహన లేదా అనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చింది ఆ ప్రకటన. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. శ్రీవాణి ట్రస్ట్…
అక్టోబర్ 5వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. అక్టోబర్ 6వ తేదిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ… అక్టోబర్ 7 నుండి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే అక్టోబర్ 7వ తేదిన సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య ధ్వజారోహణంతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు… 7వ తేది రాత్రి 8.30 నుండి 9.30 గంటల మధ్య పెద్దశేష వాహనం మీద దర్శనమివ్వనున్నారు. ఇక 8వ తేది ఉదయం…
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చాలామంది భక్తులు తిరుపతిలోని అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఒకసారి కాలినకడన ఎక్కడమే కష్టమైన ఈ రోజుల్లో ఓ భక్తులు 300 సార్లు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. 1996లో మొదటిసారి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకున్న శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాసరావు…
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టీటీడీ.. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. 7వ తేదీన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. 15న చక్రస్నానం, ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక, 7వ తేదీన రాత్రి పెద్దశేష…
అక్టోబర్ 11న ఆంధ్ర సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. అయితే తిరుమలలో అక్టోబర్ 7వ తేది నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందు భాగంగా 11 రాత్రి జరగనున్న గరుడ సేవ రోజున స్వామివారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించనున్నారు సీఎం జగన్. అదే రోజు అలిపిరి వద్ద 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గో మందిరం….తిరుమలలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు బూందీ…
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టుగా తయారైంది TTD పరిస్థితి. ఏకంగా 75 మందితో బోర్డు ఏర్పాటుకు కసర్తతు పూర్తయింది. ఇదే TTDకి సంకటంగా మారినట్టు టాక్. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా.. అంతమంది పాలకమండలి సభ్యులను సంతృప్తిపర్చడం TTDకి పెద్ద సవాలేనా? ఒత్తిళ్లతో ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య పెరిగిందా? తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ఎట్టకేలకు పూర్తయింది. సంప్రదాయాలను పక్కన పెట్టి.. 75 మందితో బోర్డు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 25 మంది బోర్డులో ఉంటారు.…
టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా దాదాపుగా ఖరారైంది. మొదటి విడతలో పాలకమండలి సభ్యుల జాబితాను విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. రెండవ విడతలో ప్రత్యేక ఆహ్వనితుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. పాలకమండలి సభ్యులుగా ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్,మల్లాడి క్రిష్ణారావు,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ఎమ్మేల్యేలు కాటసాని,గోర్లబాబురావు,మధుసూదన్ యాదవ్… తెలంగాణ నుంచి రామేశ్వరావు,లక్ష్మినారాయణ,పార్దసారధి రెడ్డి,మూరంశెట్టి రాములు,కల్వకుర్తి విద్యాసాగర్… తమిళనాడు నుంచి శ్రీనివాసన్,ఎమ్మేల్యే నందకుమార్,కన్నయ్య… కర్నాటక నుంచి శశిధర్,ఎమ్మల్యే విశ్వనాధ్ రెడ్డి… మహారాష్ట్ర నుంచి…