దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పైన కొంత పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే తిరుపతి, శ్రీకాలహస్తి కి భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేసారు. అక్కడ పాత భవానాల్లో, ఇళ్లలో ఎవరు నివాసం ఉండద్దు అని అధికారులు ప్రజలకు సూచించారు. వెస్ట్,డిఆర్ మహల్ అండర్ బ్రిడ్జ్ల వద్ద వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు అమర్చారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావం ఏపీ కంటే ఎక్కువగా తమిళనాడు పై పడుతుంది. అక్కడ ఇప్పటికే విస్తారంగా అవర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అందుకే లోతట్టు ప్రాంతాలు ప్రజలను ముందే అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.