తిరుపతి వైసీపీలో రుసరుసలు..! ఎమ్మెల్యే భూమన.. మున్సిపల్ కార్పొరేటర్ల మధ్య గ్యాప్ వచ్చిందా? పాలిటిక్స్‌లో పెత్తనాలకు కాలం చెల్లిందని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తున్నారా? ఏ విషయంలో ఎమ్మెల్యేతో వారికి చెడింది? తిరుపతిలో భూమన వర్సెస్ వైసీపీ కార్పొరేటర్లు! గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతిలో ఆశించిన మెజారిటీ రాకపోయినా.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా పట్టుసాధించింది అధికారపార్టీ. 48 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలవగా.. టీడీపీకి ఒక్క డివిజనే దక్కింది. కార్పొరేషన్ పరిధిలో పూర్తి గ్రిప్ దక్కిందన్న…
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.. అయితే, థర్డ్ ఫ్రంట్, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని దేవెగౌడ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు.. మొదట అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక పైకి రావాలన్నారు.. ప్రాంతీయ పార్టీలు ఆయా…
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టేందుకు టీటీడీ సిద్ధం అయింది. ఇందులో భాగంగా మొదటి దశలో టీటీడీ అధికారుల కోసం 35 బ్యాటరీ కార్లను ప్రవేశ పెట్టింది. వీటిని ఈరోజు తిరుమలకు తీసుకొచ్చారు. బ్యాటరీ కారులోనే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చారు. ప్రస్తుతం అధికారుల కోసం 35 బ్యాటరీ కార్లు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రెండు, మూడు దశల్లో 100 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పర్యావరణాన్ని…
సంప్రదాయ భోజనం పై వెనక్కి తగ్గింది టీటీడీ. డబ్బులు తీసుకొని భోజనం పెట్టాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు రావడంతో సంప్రదాయ భోజన పథకాని నిలిపివేస్తునట్లు ప్రకటించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. పాలకమండలి లేని సమయంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ఏ కార్యక్రమం నిర్వహించిన స్వామి వారీ ప్రసాదంగానే పెట్టాలి… డబ్బులు వసూలు చెయ్యకూడదు అని తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్వదర్శనం ప్రారంభాన్ని వాయిదా వేశాం.. జిల్లా అధికారులు ఇచ్చే నివేదిక మేరకు…
తిరుమల పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడుతున్నారు టీటీడీ అధికారులు. ఇప్పటికే ఆర్టిసి ద్వారా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఘట్ రోడ్డులో నడపాలని నిర్ణయించింది పాలకమండలి. ఆ కారణంగానే తాజాగా 35 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసింది టీటీడీ. దాంతో ఇక టీటీడీ పరిధిలోని అధికారులుకు ఇక పై ఎలక్ట్రిక్ వాహనాలు కేటాయించనున్నారు. ప్రస్తుతం వినియోగిస్తూన్న డిజిల్ వాహనాలను తిరుమల నుంచి అంచెలువారిగా తొలగించనుంది టీటీడీ. చూడాలి మరి ఈ వాహనాలను ఎప్పటి వరకు దారిలో…
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తిరిగి అన్ని రంగాలు ప్రారంభం అవుతున్నాయి. ఇక కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వేలాదిమంది కొండకు వస్తుంటారు. కరోనా సమయంలో తాత్కాలిక ఆటంకం ఏర్పడింది. అయితే, ఇప్పుడు భక్తులకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతి నుంచి తిరుమలకు వందలాది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తుంటాయి. డీజిల్ బస్సుల కారణంగా కొండల్లో కాలుష్యం పెరిగిపోతున్నది. దీంతో…
అసలే అంతంత మాత్రంగా పనిచేస్తున్న వేళ.. పదవుల పంపకం కేడర్‌కు ఆగ్రహం తెప్పించిదట. పార్టీ జిల్లా పెద్దలు కూడా వారిని పట్టించుకోలేదని టాక్. ఎన్నికల్లో గెలిచిన ఆ ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోలేదట. అదే చిత్తూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ కమిటీల కూర్పుపై కేడర్ ఫైర్! అనుబంధ సంఘాల పదవుల కేటాయింపు తిరుపతి టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పదవుల భర్తీలో సమతూకం పాటించలేదనే విమర్శలు గుప్పుమన్నాయి.…
తిరుమలలో ఆన్ లైన్ టిక్కెట్లు కేటాయింపులో గందరగోళం నెలకొంది. టీటీడీ కాల్ సెంటర్ కి భక్తుల ఫిర్యాదుల తాకిడి పెరుగుతుంది. సెప్టెంబర్ మాసంకు సంభందించిన 2 లక్షల 40 వేల… 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును నిన్న ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని ప్రకటించింది టీటీడీ. 9.30 గంటల వరకు సైట్ ఒపెన్ కాలేదంటు భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు. 9.30 గంటలకే 90 శాతం టిక్కెట్లు విక్రయాలు పూర్తి…
తిరుపతిలో చిన్నపిల్లల అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కిషోర్, సాయి శ్రీనివాస్, మునికుమార్ అనే ముగ్గురు యువకులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ.. చిన్నపిల్లల అశ్లీల వీడియోలను డౌన్ లోడ్ చేసి, ఇతరులకు వీరు షేర్ చేసినట్టు గుర్తించాము. 31 అసభ్యకర వీడియోలను నిందితులు అప్ లోడ్ చేసారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నాము. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు…
పక్క స్కెచ్ తో కన్న కొడుకుని హత్య చేయించాడు ఓ తండ్రి.. పైగా తనకు ఏమి తెలియదన్నట్టు నటించాడు. పోలీసులకు అనుమానం రావటంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, తిరుపతిలోని పీలేరులో ఈ నెల 16వ తేదీన కేవీపల్లి మండలం తువ్వ పల్లి వద్ద గిరిబాబును గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్ళతో నరికి చంపారు. తన కొడుకు చంపేశారంటూ పోలీసులకు తండ్రి జయరాం ఫిర్యాదు చేశారు. కన్న కొడుకు గిరి బాబు చెడు వ్యసనాలకు…