దొంగలు రెచ్చిపోతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం, కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయం వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారం, వెండి నగలు మాయం అయ్యాయి. రెండు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్, డాగ్ టీమ్స్ పరిశీలిస్తున్నారు. సీసీ టీవీల ఆధారంగా నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఆలయంలో చోరీపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.