అది దేశంలోనే ప్రముఖ హాస్పిటల్. అందులో ఆయన డాక్టర్ కాని డాక్టర్. అర్హత లేకపోయినా ఆ హస్పిటల్ లో ఉన్నత పదవిలో ఉన్నారు. ఇప్పుడాయన ఆ హాస్పిటల్ అభివృద్ధి చేయటం కంటే, దాన్ని వెనక్కిలాగడంలోనే ఆయన ముందున్నారట. ఆ ఆస్పత్రికి ఎందుకా పరిస్థితి వచ్చింది? ఆ అధికారి వ్యవహార శైలి ఉంటి?
తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా బర్డ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది. 1985లో పోలియో బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ కావడంతో కొద్ది కాలంలోనే విశేష ప్రాచుర్యం పోందింది. దీనితో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రోగులు బర్డ్ హాస్పిటల్ లో ఉచిత వైద్య సేవలు పొందుతున్నారు .ఒక దశలో బర్డ్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకోవాలి అంటే ఆరు నెలల పాటు ఆగవలసిన పరిస్థితి ఉండేది. కాలక్రమేణా పోలియో బాధితులు తగ్గుముఖం పడుతూ ఉండడంతో బర్డ్ ఆస్పత్రిలో ఇప్పుడు ఎముకల శస్త్ర చికిత్సకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.., ప్రస్తుతం ఆ హాస్పిటల్ లో డాక్టర్ కాని డాక్టర్ అధికారి వ్యవహరశైలితో ఆ హాస్పిటల్ ప్రతిష్టను మసకబారేలా చేస్తుందట. డాక్టర్ కాని డాక్టరైన ఆ ఆర్థికశాఖ అధికారి వాస్తవానికి తన పదవిరిత్యా హస్పిటల్ లోనే అందుభాటులో వుండాలి. వైద్యపరికరాలు కొనుగోలు మొదలుకోని సిబ్బంది బాగోగులు వరకు అన్ని పర్యవేక్షించవలసిన భాధ్యత అతనిదే. కానీ, వృత్తిరిత్యా ఆర్థికశాఖాధికారి అయిన అతను వారి బాగోగులు పట్టించుకోవడం అన్నది అటుంచితే, అసలు వారికే అందుబాటులోనే వుండరట. హస్పిటల్ కి ఆ అధికారి రావడం చాలా అంటే చాలా అరుదట. ఇక ఆర్థిక క్రమశిక్షణ పేరుతో కోతల మీద కోతలు పెడుతుండటంతో గతంలో రోజుకి 50వరకు సర్జరీలు జరిగే హస్పిటల్ లో ప్రస్తుతం వాటిలో సగం కూడా జరగడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరో వైపు బర్డ్ హాస్పిటల్ లో ప్రముఖ వైద్యులు కొందరు రిటైర్మెంట్ అయ్యారు. ఇంకొందరు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో బర్డ్ హాస్పిటల్ లో మెరుగైన సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ లను బర్డ్ కి రప్పించి పేషెంట్లకు ఉచితంగా సేవలు అందించాలని భావించారు ఉన్నతాధికారులు.
ఉన్నతాధికారుల సూచనలు మేరకు బర్డ్ అధికారులు ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖ వైద్య నిపుణులును బర్డ్ కి రప్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా ఇతర ప్రాంతాల నుంచి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు విచ్చేసే ప్రముఖ వైద్యులుకు రవాణా చార్జిలతో పాటు స్వామివారి దర్శనభాగ్యం కల్పించాలన్న ప్రతిపాదన వుంచారు. ఇంత వరకు బాగానే ఉన్నా స్వతహాగా ఆర్దిక అధికారి అయిన అతని ఆలోచన విధానం కారణంగా ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే ప్రముఖ వైద్యులకు టీటీడీ నుంచి పూర్తి సహకారం అందడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. ఎంతో బిజిగా వుండే ప్రముఖ వైద్యులు తమ ప్రాక్టీసును కూడా ప్రక్కన పెట్టి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న సమయంలో వారికి దర్శనానికి అవకాశం కల్పిస్తే చాలు…. రవాణా ఛార్జీలు చెల్లించడం టిటిడికి భారమంటూ, ఆ ప్రతిపాదనను ప్రక్కన పెట్టేలా సఫలీకృతం అయ్యారా అర్థికాధికారి. స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించడమే ప్రముఖ వైద్యులకు గొప్ప నజరానా అంటూ సెలవిచ్చారట ఆ అధికారి.
హైదరాబాద్, ముంబాయి, ఢిల్లి నుంచి ప్రముఖ వైద్యులు బర్డ్ హాస్పిటల్ కి రావడానికి అంగీకారం తెలిపినా, చివరకి టీటీడీ నిబంధనల కారణంగా వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది .వాస్తవానికి ప్రముఖ వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసిన లక్ష రూపాయలు వరకు ఆదాయం లభిస్తుంది. అలాంటి వారు తమ ఆదాయాన్ని కూడా ప్రక్కన పెట్టి బర్డ్ లో పేషంట్లకు వైద్య సేవలందించేందుకు వస్తూంటే వారికి కనీస గౌరవం కూడా అందించలేని పరిస్థితి ఆ అధికారి కారణంగా ఏర్పడుతుందట. పదివేల రూపాయలు చెల్లిస్తే చాలు ఎవరికైనా ప్రోటోకాల్ దర్శనం అందించే విధానం శ్రీవారి ఆలయంలో ఉంది. దీనితో ప్రముఖ వైద్యులు తమ కుటుంబ సభ్యులతో విచ్చేసిన సమయంలో 40 వేల రూపాయలు వెచ్చిస్తే చాలు వారికి ప్రోటోకాల్ మర్యాదలతో కూడిన వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది. హాస్పిటల్లో ఉచితంగా సేవలు అందించటానికి వస్తూన్న వైద్యులని తమ స్వంత ఖర్చుతో ఉచితంగా వైద్య సేవలందించాలని కోరుతున్న ఆ ఆర్దిక శాఖాధికారి దానికి గొప్పగా పెట్టిన పేరు ఏంటి అంటే శ్రీవారి సేవ. కాని ఆయన మాత్రం ఆ సేవకు చాలా దూరమంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ అధికారి మాత్రం డిప్యూటేషన్ పై వచ్చినా టిటిడి నుంచి ఠంచనుగ జీతం, బంగ్లా, వాహన సౌకర్యం పొందుతారు. స్వామివారి దర్శనం ఉచితంగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పొందుతారు. ఇలా అన్ని ఉచితంగా పొందుతున్న ఆ అధికారి మాత్రం స్వామి సేవ పేరుతో ఒక్క రూపాయి కూడా చెల్లించరు.