Tirupati Stampede: తిరుమల తిరుపతి కొండపై జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతుంది. వర్చువల్ విధానంలో తొక్కిసలాట బాధితులను రిటైర్డ్ న్యాయమూర్తి విచారించారు. తిరుపతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయం నుంచి విచారణ జరిపారు. తొమ్మిది మంది బాధితుల నుంచి అధికారులు వాంగ్మూలం సేకరించారు. మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడి నుంచి విచారణ అధికారి వాంగ్మూలం సేకరించారు. అలాగే, ఇద్దరు తమిళనాడు భక్తులు, ముగ్గురు చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులను విచారణ చేశారు. ఆరు నెలలలోపు ప్రభుత్వానికి విచారణ కమిషన్ నివేదిక ఇవ్వనుంది.
Read Also: CM Chandrababu: ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించనున్న ఏపీ సర్కార్
అయితే, జనవరి 10వ తేదన వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా రెండు రోజుల ముందు నుంచి తిరుపతిలో దర్శనాల టికెట్లను జారీ చేసే కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ సందర్భంగా జనవరి 8వ తేదీన జరిగిన తొక్కిసలాటలో సుమారు ఆరుగురు చనిపోగా మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కూడిన కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.