AP Crime: భర్త అంటే భరించేవాడు.. తోడు, నీడగా ఉండేవాడు.. ఏడు అడుగులు వేసి తన వెంట వచ్చిన ఆమెను ఎల్లకాలం కాపాడే బాధ్యత తీసుకునేవాడు.. కానీ, డబ్బుల కోసం ఓ భర్త సైకోగా మారిపోయాడు.. నువ్వు ఏదైనా చేసి.. చివరకు.. నాకు మాత్రమే చూపించాల్సిన నీ అందాలను.. ఆన్‌లైన్‌లో చూపించూ.. న్యూడ్ కాల్స్ చేసి.. మొత్తానికి డబ్బులు కావాలి అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.. భార్యను న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్నాడు ఓ సైకో భర్త… ఆ వేధింపులను తట్టుకోలేక.. తన భర్త నుండి రక్షణ కల్పించాలని మీడియా ముందుకు వచ్చింది తిరుపతికి చెందిన శ్రీదేవి అనే మహిళ..
Read Also: Haryana: గ్రేట్.. పుల్వామా దాడిలో అమరుడైన జవాన్ కుమారుడు.. అండర్-19 జట్టుకు ఎంపిక
కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని బెదిరించి చామెట్, చిల్ చాట్ వంటి యాప్ ద్వారా భర్త సుబ్రహ్మణ్యం రెడ్డి తనతో న్యూడ్ కాల్స్ చేయించాడని.. అలా చేసినా న్యూడ్ కాల్స్ ద్వారా 18 లక్షల నగదు, బంగారం కోన్నామన్నారు శ్రీదేవి.. అయితే, డబ్బు,నగలు సంపాదించిన తరువాత ఆర్థిక పరిస్థితి బాగుందని ఇక నేను అలాంటి పనులు చేయానని చెప్పడంతో నాపై దాడులు చేయడంతో పాటు చంపేస్తామని బెదిరిస్తున్నాడుని ఆవేదన వ్యక్తం చేసింది.. ఖచ్చితంగా న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని.. లేదంటే పిల్లలు ఇవ్వనని ఇంటి నుండి భార్యను గెంటివేయడంతో పాటు భర్త తనను పలుమార్లు చేయిచేసుకున్నాడని.. తీవ్రంగా కొట్టి.. నా వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు లాగేసుకున్నాడని వాపోయింది..
Read Also: Jaggery: చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదా?
ఇక, భర్త వేధింపులపై ఆర్‌సీ పురంలో కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే.. అక్కడ కానిస్టేబుల్ రమణ నన్ను లైంగికంగా వేధించాడని.. అసభ్యకర మెసేజులు పెట్టి.. రాత్రికి రావాలంటూ వేధింపులకు గురి చేశాడని కన్నీటి పర్యంతం అయ్యింది.. తనకు జరుగుతున్న అన్యాయంపై భర్త వేదింపులపై మహిలా పోలిస్ స్టేషన్‌కు.. ఆర్‌సీ పురం స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు బాధితురాలు శ్రీదేవి.