CM Chandrababu: దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు అని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుపతి వేదికగా 2వ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి ప్రారంభించారు చంద్రబాబు.. మూడు రోజుల పాటుఈ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో కొనసాగనుంది.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 55 కోట్లు మంది కుంభమేళాలో పవిత్రమైన స్నానాలు ఆచరించారు.. అంటే, దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు అని అభివర్ణించారు.. ఈ ఎక్స్ పో పాల్గొనడం సంతోషంగా ఉందన్న ఆయన.. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు.. టెక్నాలజీ వినియోగంలో మనం మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక ఏఐ నిపుణుడు తయారు అవుతున్నాడని తెలిపారు.
Read Also: Prabhas – Mahesh : ఓపక్క మహేష్ మరో పక్క ప్రభాస్
ఇక, ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగులు వేస్తున్నారు.. కోట్లమంది భక్తులు విరాళాలు ఇస్తున్నారు.. వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. అన్నదానం ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. దానికి రెండు వేల కోట్లు విరాళాలు రూపంలో వచ్చాయి.. ప్రాణాదానం ట్రస్ట్ కు 440 కోట్లు విరాళంగా వచ్చాయని వెల్లడించారు.. కుటుంబ వ్యవస్థ మనదేశానికి అతిపెద్ది ఆస్తి, బలంగా అభివర్ణించారు.. దేశ, విదేశాలలో వెంకటేశ్వర స్వామీ ఆలయాలు పెరుగుతున్నాయి.. ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను అన్నారు.. మన సంస్కృతి , వారసత్వ పరిరక్షణకు దేవాలయాలది ప్రధాన పాత్ర అని పేర్కొన్నారు.. రాష్ట్రంలో ఆలయా అభివృద్ధి, దేవాలయం సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తున్నాం.. అర్చకులకు వేతాలను పెంచాం.. ఆలయాలలో దూప, దీప, నైవేద్యాలకు ఇచ్చే నగదును పెంచామని వెల్లడించారు..
Read Also: Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి
మరోసారి ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు.. దేశానికి సరైనా సమయంలో సరైనా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారని పేర్కొన్నారు.. రాష్ట్రంలో అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతుంది.. 7 నెలలో 134 కోట్లు ఆలయాల కోసం ఖర్చు చేశాం… ఆలయాల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. తిరుమలలో 75 శాతం పచ్చదనం నెలకొని ఉంది.. ఆలయాల్లో సైతం గ్రీన్ ఎనర్జీ వినియోగంలోకి తీసుకుని వస్తా.. దేవుడి సేవ చేయడం.. అన్నిటికన్నా గొప్పది.. పక్కవాడికి మోసం ఈ జన్మలో కర్మఫలం అనుభవించాలి అంటూ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..