Minister Nara Lokesh: హిందూ ధర్మం సనాతన ధర్మం.. మానవ సేవే మాధవ సేవ.. సాటి మనుషులకు, సమాజానికి సేవ చేస్తే, ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతోందన్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ మరియు ఎక్స్‌పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుందన్నారు.. మన సంస్కృతిలో ఆలయాలు, పండుగలు, పూజలు అనేది కీలకమైన భాగం అని వెల్లడించారు.. ఎంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చినా మానవ సమాజాన్ని నడిపించేది ఆ దేవదేవుడే. ఇస్రో శాస్త్రవేత్తలు సైతం.. వారి ప్రయోగం సక్సెస్ కావాలని చెంగాలమ్మ ఆలయంలోనో.. తిరుమల శ్రీవారి ఆలయంలోనో ముందు రోజు పూజలు చేస్తారు. నమ్మకం మాత్రమే గాక ఇదొక నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు, దేవాలయ వ్యవస్థలు, సంస్ధలు కృషి చేయాలి.. దీని ద్వారా సమాజంలో మంచిని పెంచవచ్చన్నారు.
Read Also: Harish Rao: పంజాగుట్ట ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట..
పిల్లలకు గంటలకు గంటలు ఫోన్లు, ట్యాబ్ లు ఇచ్చే పద్దతికి స్వస్తి చెప్పాలని సూచించారు నారా లోకేష్.. ఆ సమయంలో మన పురాణాలు, మన దేవుళ్లు, మన పండుగలు, ఆచారాల గురించి చెప్పే పుస్తకాలు ఇవ్వాలని.. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ల కంటే మన హనుమాన్ శక్తి వంతుడు అని చెప్పాలన్నారు లోకేష్.. హారీపోర్టర్ కథల కంటే మన పురాణాల్లో ఉన్న కథలు ఇంకా బాగుంటాయని వివరించాలి. ఎవెంజర్స్ ఎండ్ గేం, క్యాప్టెన్ అమెరికా, అవతార్ సినిమాల కంటే.. మన శ్రీకృష్ణుడి లీలలు, మన శ్రీ రాముడి గొప్పతనం గురించి చెప్పాలి. అందరం కలిసి సంస్కృతిని కాపాడుకోవాలన్నారు.. వాట్సాప్ ద్వారా ఆలయాల సేవలు, డ్రోన్ నిఘా వంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలతో మన ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుతూ.. ఆలయాల పాలనా వ్యవస్థను ఆధునీకరించడంలో ఏపీ ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి నారా లోకేష్.