Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ పోలీసులు కథువా జిల్లాలోని మల్హర్, బానీ, సియోజ్‌ధర్‌లోని ధోక్స్‌లలో చివరిగా కనిపించిన నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ ఫోటోలను విడుదల చేశారు. పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి ప్రజల సహాయాన్ని కోరుతున్న కథువా పోలీసులు ఇవాళ వీటిని రిలీజ్ చేశారు. కథువాలో ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా పంచుకుంటే వారికి రూ.5 లక్షలు అందజేస్తామని పోలీసులు ప్రకటించారు.
Read Also: Muppavarapu Venkaiah Naidu: నేతలపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా అయితేనే రాజకీయాల్లోకి రండి
జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో దాదాపు 40 నుంచి 50 మంది ఉగ్రవాదులు గుంపులుగా తిరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మిలిటెంట్లు భద్రతా బలగాలపై, వారి కాన్వాయ్‌లపై దాడులు చేస్తున్నారు. రాజౌరి, రియాసి జిల్లాలో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగానే ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్ ఫోటోలను గీయించారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి శాంతియుతంగా ఉన్న జమ్మూ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో 14 తీవ్రవాద దాడులు జరిగాయి.. దీని ఫలితంగా 11 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా 27 మంది మరణించారు.