ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవలి కాలంలో పులులు చిరుత పులుల సంచారం ఎక్కువైంది. మొన్నీమధ్య ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పులులు సంచరించి వెళ్లిపోగా.. ఉన్నన్ని రోజులు పశువుల పై పంజా విసిరాయి.. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో నీ చిన్న రాజురా శివారులో పులి సంచరిస్తుంది. గ్రామ పరిధిలో నీ పెద్ద వాగు వద్ద పులి పాదముద్రలు చూసిన స్ధానికులు భయాందోళనకు గురయ్యరు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పాదముద్రలు చూసి ఇది…
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. ఓయూ హాస్టల్ కేటాయింపులో వీసి నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరో కొద్దిరోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ట్రయల్ రన్ ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 100 మంది భూ నిర్వాసితులను అరెస్ట్ చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తీసుకొని వెళ్లారు. వీరిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు, భూ…
యాదాద్రి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యాదగిరిగుట్టలో ఆటో కార్మికులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే ఆటో కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో ఇవాళ ఆటో సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కొండపైకి ఆటోలను నిషేధించడంతో.. జీవనోపాధి కోల్పోయామని ఆటో కార్మికుల ఆందోళన వ్యక్తం చేశారు. కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో కార్మికుల డిమాండ్ చేశారు. అయితే.. 2022 మార్చి 31న యాదాద్రి…
కాకినాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానస్పదంగా మృతి చెందడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి 48 గంటలు దాటిపోవస్తున్నా ఇంకా పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. సుబ్రహ్మణ్యం హత్య పట్ల కాకినాడ పట్టణంలో పలు పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. టీడీపీ నిజనిర్దారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి పితాని…