ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. క్షణికావేశంలో యువతీ, యవకులు, దంపతులు ఆత్మహత్యలకు పాల్పడడం ఈమధ్యకాలంలో ఎక్కువైంది. పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో చదివే విద్యార్ధినీ, విద్యార్ధులు వత్తిడికి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ ,సైకియాట్రిక్ సొసైటి ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. బెంజిసర్కిల్ నుండి ఇందిరాగాంధి స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీకి హాజరైన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మహత్యల నివారణకు చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.
Read Also: Delhi International Airport: భారీగా బంగారం పట్టివేత.. గాజులరూపంలో తరలించే యత్నం..
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అన్నారు. అనేక అవగాహన సదస్సులు చేపట్టామన్నారు. 8 నుండి 12తరగతి విద్యార్దులు చదువుల వల్ల డిస్టర్బ్ అవుతున్నారు.. తల్లిదండ్రులు తమ పిల్లలపై చదువుల ఒత్తిడి ఆపాలి. క్వాలిటి ఎడ్యుకేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చిందన్నారు డీజీపీ. 18 నుండి 35 వయసులోపు వారు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువతీ యువకులకు నిరంతరం కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉండాలన్నారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణపై అవగాహనకు ర్యాలీలు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఆత్మహత్యల నివారణ అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఎస్పీ ప్రారంభించి ప్రసంగించారు. అనకాపల్లిలో అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతోర్యాలీ నిర్వహించారు పోలీసులు. ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నించాలన్నారు. నంద్యాలలో మున్సిపల్ ఆఫీసు వద్ద ఆత్మహత్యల నివారణ ర్యాలీని ప్రారంభించారు ఎస్పీ రఘువీర్ రెడ్డి, డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి. సైకియాట్రిక్ సొసైటీ డాక్టర్స్, శాంతిరామ్ హాస్పిటల్ సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Read Also: Imran Khan: నన్ను అరెస్ట్ చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ప్రభుత్వానికి ఇమ్రాన్ వార్నింగ్