మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ళ దాడి జరిగింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ జగదీష్ సహా పలువురికి గాయాలయ్యాయి. టిఆర్ ఎస్-.బిజెపి కార్యకర్తలు పరస్పర దాడికి దిగారు.
ఈ ఘటనలో ఈటల కారు ధ్వంసమయింది. కాగా అటు టిఆర్ ఎస్ నేతలకు గాయాలు అయ్యాయి.అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు ఈటల. నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఆఖరు కావడంతో పలు పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరు పార్టీల నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.