అక్రమ కట్టడాలు, గుడిసెలు హైదరాబాద్ లో మామూలే. వీటిని తొలగించడం జీహెచ్ ఎంసీ, మునిసిపల్ సిబ్బందికి కత్తిమీద సామే. తాజాగా అదే జరిగింది. కొండాపూర్ లో పార్క్ స్థలంలో అక్రమంగా వెలసిన గుడిసెలు తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొండాపూర్ JVG హిల్స్ కు సంబంధించిన పార్క్ స్థలంలో అక్రమంగా వెలసిన గుడిసెలను తొలగిస్తున్నారు GHMC సిబ్బంది. అక్రమంగా పార్క్ స్థలంలో దాదాపు 25 గుడిసెలు ఉన్నట్లు చెబుతున్నారు బల్దియా అధికారులు. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసుల బందోబస్తు నడుమ గుడిసెలను తొలగిస్తున్నారు బల్దియా అధికారులు.
గుడిసెలు తొలగింపును అడ్డుకునేందుకు వచ్చిన స్థానిక బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే బాధితులను రోడ్డున పడేస్తే ఎలా అని ప్రశ్నించారు బీజేపీ నాయకులు. గుడిసెలలో ఉంటున్న బాధితులకు పక్కా ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థానిక బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్. గుడిసెల తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో అక్కడ కలకలం రేగింది. మరోవైపు ఈరోజు మసీద్ బండ హై టెన్షన్ రోడ్ లో 15 సంవత్సరాలుగా నివాసముంటున్న బస్తి వాసులకు ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా గుడిసెలను తొలగిస్తుండగా అధికారులను, పోలీసులను అడ్డుకోవడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారిని అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు ..అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్ప మీరు ప్రజలకు ఏం చేశారని రవికుమార్ యాదవ్ మండిపడ్డారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ముందు ఎలుకల జాతికి చెందిన వారు ఆందోళన పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీవనోపాధి చూపించకుండా తమ పందులను తరలించడంపై మున్సిపల్ కార్యాలయం ముందు ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఎలుకల జాతి వారు. వెంటనే స్పందించారు పోలీసులు. ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అక్కడినించి తరలించారు.
Read ALso: Auto Driver Case Mystery: వీడిన ఆటో డ్రైవర్ మృతి కేసు మిస్టరీ.. భార్యతో అలా ఉన్నాడని..