ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవలి కాలంలో పులులు చిరుత పులుల సంచారం ఎక్కువైంది. మొన్నీమధ్య ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పులులు సంచరించి వెళ్లిపోగా.. ఉన్నన్ని రోజులు పశువుల పై పంజా విసిరాయి.. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో నీ చిన్న రాజురా శివారులో పులి సంచరిస్తుంది. గ్రామ పరిధిలో నీ పెద్ద వాగు వద్ద పులి పాదముద్రలు చూసిన స్ధానికులు భయాందోళనకు గురయ్యరు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పాదముద్రలు చూసి ఇది పులివేనని ధృవీకరించారు. నీరు తాగడానికి వాగు వాగు వద్ద వచ్చిందని మల్ల తిరిగి భీంపూర్ మీదుగా ఖనర్ గాం , కాగజ్ నగర్ వైపు వెళ్లిందని భావిస్తున్నారు అటవీశాఖ అధికారులు.
Read Also: Teachers Transfers: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.
మరోవైపు, కుంటాల మండలం దౌనెల్లి శివారులో చిరుత సంచారం రైతులకు నిద్ర లేకుండా చేస్తుంది. అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. ఆవు నర్సాపూర్ జీ మండలం భూర్గూపెళ్ళి (జీ) కి చెందిన రైతుదిగా గుర్తించారు. చిరుత సంచారంతో భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా ఉంటే మహారాష్ట్ర సరిహద్దులో బెబ్బిలి భయం వెంటాడుతుంది. చంద్రపూర్ జిల్లా రాజుర తాలూకాలోని పులి సంచరిస్తుంది. మకోడి గ్రామం పరిధిలో రైల్వే ట్రాక్ వేసే కార్మికులకు పులి కనిపించింది. ఇక, గడ్చిరోలి జిల్లాలో పులి దాడిలో గాయపడ్డ మహిళ ప్రాణాలు కోల్పోయారు. అంబేశివ్ ని గ్రామంలోని వరి పొలంలో పనిచేస్తున్న సోనీ జితేంద్ర ఉండిర్వాడే (24) అనే మహిళ ఈనెల 4న పులి దాడి చెయ్యడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు.. అటు చంద్రాపూర్ ఇటు గడ్చిరోలి జిల్లా ల్లో వరుసగా మనుషులను చంపేస్తున్నాయి పులులు. ఇక తెలంగాణలో సైతం ఇప్పటి వరకూ పులులు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాయి.. ఆ మూడు ఘటనలో కొమురం భీం జిల్లాలో లోనే జరిగాయి.. ఓవైపు పులులు, మరోవైపు చిరుతలతో భయాందోళనకు గరవుతున్న ప్రజలు.. వాటిని పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.