సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరో కొద్దిరోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ట్రయల్ రన్ ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సుమారు 100 మంది భూ నిర్వాసితులను అరెస్ట్ చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తీసుకొని వెళ్లారు. వీరిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు, భూ నిర్వాసితుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కొంత లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు భూ నిర్వాసితులకు గాయాలు కూడా అయ్యాయి. గుడాటిపల్లి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
కాగా.. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి.బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి. సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి-గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అని మండిపడ్డారు.
వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూనిర్వాసితుల అరెస్టులను బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కూడా ఖండించారు. నిర్వాసితులపై దాడి సిగ్గుచేటని.. పరిహారం చెల్లించకుండానే వారిని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి.బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి
సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి-గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నావారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది pic.twitter.com/i0arUrBOq2
— Revanth Reddy (@revanth_anumula) June 13, 2022