కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో ఆయన కాల్చుకు బలవన్మరణానికి పాల్పడినట్టు చెబుతున్నారు. అధికారులు మాత్రం.. మిస్ ఫైర్ జరిగి ఎస్సై మృతి చెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్ ఫైర్ జరిగి మృతి చెందారా? అనేది తేలుతుందని అంటున్నారు. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే శాఖ భూముల వ్యవహారంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నష్ట పరిహారం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధిత కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మణుగూరు మండలం రామానుజవరం బీటీపీఎస్ కోసం రైతుల భూముల ను బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కుంటున్నారని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెవిన్యూ అధికారులు లేకుండా భూములు స్వాధీనం చేసుకునేందుకు…
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్‌కు మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టగా, ఉక్రెయిన్‌లో రెబల్స్ తిరుగుబాటు దారులు దాడులు చేసేందుకు సిద్దమయ్యారు. ఉక్రెయిన్ అనుకూల వాదులు ముందుగా దాడులకు దిగుతున్నారని, రెబల్స్ పేర్కొంటున్నారు. అయితే, ఉక్రెయిన్ వ్యతిరేకులే దాడులకు దిగుతున్నట్టు చెబుతున్నారు. దాడులకు దిగబోమని రష్యా చెబుతున్నది. కానీ, ఈ మాటలను నమ్మే స్థితిలో ప్రపంచదేశాలు లేవని, ఏ క్షణంలో అయినా రష్యా ట్రిగ్గర్ నొక్కే అవకాశం ఉంటుందని అమెరికా…
తిరుపతిలో ఇటీవలే భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నగరంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక తిరుపతిలోని కృష్ణానగర్‌లోని ప్రజలు గత రెండు రోజులుగా భయంతో వణికిపోతున్నారు. వర్షాల తరువాత కృష్ణానగర్‌లోని ఓ మహిళ ఇంట్లోని వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి పైకి వచ్చింది. ఈ సంఘటన తరువాత కృష్ణానగర్‌లోని ప్రజలు కంటిమీద కునుకులేకుండా కాలం గడుపుతున్నారు. Read: లైవ్: ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ ఎటు…
తిరుపతి నగరంలో భారీవర్షాల తర్వాత నిండుకుండలా మారిన రాయలచెరువు స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రాయల చెరువు సమీప గ్రామాల ప్రజలు ఇంకా భయం గుప్పెట్లోనే వున్నారు. అక్కడ క్షణక్షణం ఉత్కంఠ. రాయల చెరువు ప్రాంతంలో జారుతున్న మట్టితో జనం ఊపిరి బిగపట్టి మరీ జీవితం వెళ్ళదీస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కంటిమీద కునుకు లేకుండా వుంది జిల్లా యంత్రాంగం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. రాయలచెరువు కట్టపైనే ఎమ్మెల్యే…
కర్నూలు జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్ద పులి కనిపించింది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. వాహనాలు నిలిపివేసి ఫోటోలు, వీడియోలు తీసిన ప్రయాణికులు. ఎన్టీవీ చేతిలో వీడియోలు వున్నాయి. పెద్ద పులి ఎటు నుంచి ఎటు వెళ్ళిందోనని టెన్షన్ పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
ఒకవైపు దీపావళి పండుగ.. మరోవైపు పండుగ సందడి వేళ గుజరాత్ లోని ద్వారక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ మధ్య కాలంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగనాడు గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల…
మాజీ మంత్రి చేరిక.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోందా? ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కలవర పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? మోత్కుపల్లి చేరికతో.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..! మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత.. ఆ చేరిక ప్రకంపనలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నాయి. పైకి ఎవరూ చెప్పకపోయినా.. కొందరు ఎమ్మెల్యేలు తమకేమైనా గండం పొంచి…
ముహూర్తం దగ్గర పడుతోంది. అలాగే ఆశావహుల్లో టెన్షన్ కూడా పెరిగిపోతోంది. జిల్లాకు ఎన్ని పదవులు వస్తాయో ఏమో కానీ.. వాటికోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య మాత్రం చాలానే ఉంది. అయితే సీనియారిటీ, సామాజిక కోణాల్లో అధినేత వేటికి ప్రాధాన్యం ఇస్తారో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆశావహులు. అనంతలో మంత్రి పదవి కోసం ఐదుగురు పోటీ..! ప్రస్తుతం అనంతపురం అధికారపార్టీలో వినిపిస్తున్నది ఒక్కటే మాట. నెక్ట్స్ మంత్రిగా ఎవరికి ఛాన్స్ వస్తుంది. త్వరలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశాలు…
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది… పరిపాలన చేతకానివాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్… కొంతమంది కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.. వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ,…