Headaches : తలనొప్పి అనేది చాలామంది అనుభవించే ఒక సాధారణ వ్యాధి. ఈ తలనొప్పి తేలికపాటి అసౌకర్యం నుండి తీవ్రమైన నొప్పి వరకు ఉండవచ్చు. అంతేకాకుండా ఈ తలనొప్పి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. తలనొప్పి ఎందుకు సంభవిస్తుందో, ఒకసిలా వస్తే దాని నుండి ఉపశమనం ఎలా పొందాలో చూద్దాం. తలనొప్పికి కారణాలు: తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కొన్ని సాధారణ కారణాలలో ఒత్తిడి, డిహైడ్రేడ్, నిద్ర లేకపోవడం, పేలవమైన భంగిమ, కంటి ఒత్తిడి, సైనస్…
Tension in Karimnagar: కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తాలో శనివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలో హనుమాన్ మాలధారులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఓ మతస్థుడు వచ్చి కత్తితో నృత్యం చేసి ర్యాలీని అడ్డుకున్నాడు.
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా.. పోలింగ్ రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరగ్గా, కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పరకాల మండలం నాగారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ సెంటర్ దగ్గర బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడే…
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పై టీడీపీ నాయకుడు కంచేటి సాయిబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కంచేటి సాయికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు వైసీపీ శ్రేణులు. తమ నాయకుడు పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని కర్రలు చేత పట్టి టీడీపీ నాయకుడు సాయిబాబు ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు.…
హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్.. తుంటి నొప్పితో ఆ ఆస్పత్రిలో సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖ నేతలు వచ్చి వెళ్తున్నారు. అయితే.. తాజాగా కేసీఆర్ ను చూడటానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆస్పత్రి ముందు జై కేసీఆర్, జై రామన్న అంటూ నినాదాలు చేశారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కి పంపించ లేదు. ఈ క్రమంలో.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవో కార్యాలయానికి భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.
రుషికొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరికాసేపట్లో నోవాటల్ నుండి ఋషికొండకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన దృష్ట్యా.. రుషికొండకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు జోడిగుళ్లపాలెం, సాగర్ నగర్, ఋషికొండ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.