breaking: సీపీఎం కార్యాలయంపై బాంబుల దాడి.. కేరళలో టెన్షన్, టెన్షన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు.. ఈ మధ్యే వయనాడ్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా, ఈ నేపథ్యంలో సీపీఎం కార్యాలయంపై దాడి జరగడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. గత రాత్రి అధికార సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పేలుడు పదార్థాన్ని విసిరినట్టు పోలీసులు చెబుతున్నారు. రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న ఏకేజీ సెంటర్‌పై రాత్రి 11.30 గంటల సమయంలో మోటర్‌బైక్‌పై వచ్చిన వ్యక్తి పేలుడు పదార్థాన్ని విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న సీపీఐ(ఎం) నాయకులు ఇది బాంబుల దాడిగా ఆరోపించారు. ఏకేజీ భవన్‌లో బస చేసిన కొందరు పార్టీ నేతలు భవనం వెలుపల శక్తివంతమైన పేలుడు వినిపించినట్లు చెప్పారు.
Read Also: Rupee falls: రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి విలువ..
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ఇక, అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారుల బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాలను పరిశీలించారు. బాంబు స్క్వాడ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఏకేజీ సెంటర్‌లోని అధికారిక మీడియా గ్రూప్ ద్వారా సీపీఎం విడుదల చేసిన సీసీటీవీ విజువల్స్‌లో ఒక వ్యక్తి మోటర్‌బైక్‌పై ఘటనా స్థలానికి చేరుకుని భవనంపై “బాంబు” విసిరి అక్కడి నుండి పారిపోతున్నట్లు చూపించారు. పేలుడు పదార్థం ఏకేజీ సెంటర్‌లోని గోడకు తగిలింది.. అయితే, ఈ రెచ్చగొట్టే చర్య వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని.. సీపీఎం శ్రేణులు ప్రశాంతంగా ఉండాలని ఆ పార్టీ సీనియర్ నేత, ఎల్‌డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ సూచించారు.. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. మరోవైపు ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్, విద్యాశాఖ మంత్రి వీ శివన్‌కుట్టి సహా పలువురు కేరళ మంత్రులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నగరంలో పలువురు సీపీఐ(ఎం) కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.. రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో కాంగ్రెస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం తన నియోజకవర్గం వాయనాడ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!