బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. నిన్ననే మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్ను వీడుతున్న అని ప్రకటించిన మరునాడు ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి మరికొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి సంక్షేమ లో రవీందర్ రావు, మధుమతి దంపతులు.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ సీఎం కేసీఅర్…
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి, అత్యధిక స్థానాలు సాధిస్తామని పేర్కొన్నారు. కులమతాలు, పార్టీలు చూడకుండా సీఎం జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారని అన్నారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 11వ జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇంఛార్జులను ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జుగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జుగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ ఇంఛార్జుగా గొల్లపల్లి సూర్యారావు పేర్లను ప్రకటించింది.
పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ బిక్షేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మాహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకూడదని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
శివరాత్రి, తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్ధి సునీల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వారికి అమ్మవారి వస్త్రం, ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనం చేశారు. దర్శనంతరం మంత్రి కారుమూరి.. బయటికొచ్చి ఎన్టీవీతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ సింగిల్ గా వస్తారు... పొత్తులు పెట్టుకోరని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు.
పాతబస్తీ మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర ఐదు స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి వెళ్లవచ్చు. ఈ సందర్భంగా…
జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి (NH)44పై దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడ్లకోయ జంక్షన్ సమీపంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి…
దక్షిణ తెలంగాణలో కరువు ఛాయాలకు కేసీఆర్ పాలనే కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం స్వరంగం పనులు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈరోజు రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడేవారు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే తెలంగాణ తెచ్చుకున్న ఆనందం కూడా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. కాగా.. భారత్ 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) పరుగులతో ఉన్నారు.
ఇందిరా పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చరిత్రలో మహిళతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడలేదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని కవిత కోరారు. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని…