పురిటి గడ్డపై మమకారంతో మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో.. ప్రజల జీవితాలు మార్చాలన్న ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా 16 పథకాలను సొంత నిధులతో ప్రజల్లోకి తీసుకువెళ్లి వేలాదిమందికి లబ్ధి చేకూర్చిన ఘనత ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు దక్కింది. ట్రస్ట్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం…
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ! తెలంగాణలోని జగిత్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదయించారు. పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టారు. శనివారం ఉదయం జగిత్యాల స్థానిక తహసీల్దార్ కార్యాయలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…
ప్రముఖ అభరణాల షోరూం వేగ జ్యుయలర్స్ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అయితే.. ఈ నేపథ్యంలో విజయవాడలోని వేగ జ్యుయలర్స్ వేడుకల్లో సినీనటి ఈషా రెబ్బా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి ఈషా రెబ్బా వేగ జ్యుయలర్స్ మొదటి వార్షికోత్సవ లక్కీ డ్రా పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తమను ఆదరించి, విశ్వసించి విజయాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సంస్థ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్ ధన్యవాదాలు…
ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. తాడేపల్లిలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో వైసీపీ ముఖ్యుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మీ వినతిని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళతాం. మీ ఆలోచనలను వివరిస్తామన్నారు. కేసీఆర్ గారు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి అని, మున్నూరు కాపు నేతలకు గతంలోనూ ఎంతో…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఏ.ఎం. రెడ్డి ఆటిజం సెంటర్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆటిస్టిక్ చిన్నారుల తల్లులను ప్రశంసించారు. అనంతరం తల్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మార్చి 7న సాయంత్రం హెూటల్ దస్పల్లాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆటిస్టిక్ పిల్లల తల్లిదండ్రులు వారి కుటుంబాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ.ఎం. రెడ్డి ఆటిజం పెరుగుదల మరియు ఇతర ప్రవర్తనా సవాళ్ల గురించి తల్లితండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. చిన్న చిన్న ఆరోగ్య…
వర్ధన్నపేట, పాలకుర్తి నియోజక వర్గాల నుంచి పలువురు బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్వని రెడ్డి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశ్వస్విని రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారు. వారందరికీ హృదయ పూర్వక స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ వేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు. 3 రోజుల నుండి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
ఆన్లైన్లో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ లెటర్ని రాసి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కృష్ణ కుమార్. అయితే.. కృష్ణ కుమార్ వర్థన్నపేట మండలం కేంద్రంలోని అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త మిస్సింగ్ పైనా వరంగల్ మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కృష్ణ కుమార్ భార్య. కృష్ణ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మిల్స్ కాలనీ పోలీసులు…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన-బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ అంశంపై క్లారిటీ రానుంది. మచిలీపట్నం లోక్సభ స్థానం…