ఢిల్లీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏపీలో అభ్యర్థుల ఖరారుపై బీజేపీ తుది కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలోని బృందం ఏపీకి వచ్చింది. గజేంద్ర సింగ్ షెకావత్ బృందంలో ఒడిశా ఎంపీ జై జయంత్ పాండా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై గజేంద్ర సింగ్ షెకావత్ తో పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఈ చర్చల్లో బీజేపీ అగ్ర నేతలు శివ ప్రకాష్, మధుకర్ కూడా పాల్గొన్నారు.
Read Also: YSRCP: ఎన్ని పార్టీలు ఏకమై గుంపుగా వచ్చినా సీఎం జగన్ యుద్ధానికి ‘సిద్ధం’..
బీజేపీ పోటీ చేసే అవకాశం ఉన్న లోక్సభ స్థానాలు..
అరకు, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి, హిందూపురం ఉన్నాయి. అనకాపల్లి, ఏలూరు, కర్నూలు లోక్ సభ స్థానాల్లో పోటీ పైనా సమాలోచనలు ఉన్నాయి. మొత్తంగా ఆరు లోక్ సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.
బీజేపీ పోటీ చేసే అవకాశం ఉన్న అసెంబ్లీ స్థానాలు..:
పాడేరు, విశాఖ నార్త్, కాకినాడ అర్బన్ లేదా రాజమండ్రి అర్బన్, పి. గన్నవరం, ఉంగుటూరు, కైకలూరు, మదనపల్లె, కదిరి, శ్రీ కాళహస్తి, గుంటూరు ఈస్ట్ లేదా వెస్ట్. ఆరు లేదా ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్దమవుతోంది. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై గజేంద్ర సింగ్ షెకావత్ కసరత్తులు చేయనున్నారు. ఈ క్రమంలో.. రేపు ఏపీ బీజేపీ ముఖ్య నేతలతో గజేంద్ర సింగ్ షెకావత్ సమావేశం కానున్నారు.