హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఘరానా మోసం జరిగింది. మంత్రాలతో చేతబడిని తొలగిస్తాను, దెయ్యాన్ని తొలగిస్తాను అంటూ నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళకు టోకరా వేసిన ఘటన ఫిల్మ్నగర్లో చోటుచేసుకుంది.
బీజేపీ అనేది పెద్ద కుటుంబం.. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తనకు కల్మషం ఉండదని, ఎవరి మీద కోపం ఉండదని.. ఎవరితో తనకు అభిప్రాయ భేదాలు లేవని ఆయన తెలిపారు.
వేయి స్తంభాల గుడిలో పునర్నిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి ఉదయమే చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో కిషన్ రెడ్డి పూజలు చేశారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠుణ్ణి సీఎం ప్రార్ధించారు.
సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ విస్తరణ జరగనుంది. ఫేజ్ 2లో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. సిటీలోని నలుమూలల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టు కనెక్ట్ అయ్యేలా కొత్త రూట్ డిజైన్ చేశారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువై ఉన్న ఏడు పాయల వనదుర్గా భవాని జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. మహాశివరాత్రి నుంచి మూడు రోజుల పాటు వనదుర్గా భవాని జాతర కొనసాగనుంది.
గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ రాజకీయ నాయకుడు అనుకున్నాను కానీ జ్యోతిష్యుడు అనుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.