విశాఖలో ఓ ప్రేమజంట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అంటూ నిరుద్యోగులను నమ్మించి వారి దగ్గరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. నకిలీ పోలీస్ అవతారమెత్తి.. తాము పోలీసులమంటూ నమ్మబలికారు. దీంతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు అనగానే.. నిరుద్యోగులు వారికి భారీ ఎత్తున ముట్టజెప్పారు. ఇదే అదునుగా భావించిన నకిలీ పోలీసులు 30 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేసింది.
మహాశివరాత్రి పర్వదినాన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాలువలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు నిజమాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం గన్యా తండాకు చెందిన యువకులు సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరి సరదాగా కాలువలోకి దిగడంతో అందులోనే జారిపోయారు. అయితే గల్లంతైన యువకుల కోసం అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే లక్ష్మి కాలువకు నీటి విడుదల అవుతుండగా.. యువకులను గుర్తించడం కోసం…
లోక్ సభ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. ఈరోజు.. 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. తెలంగాణలో 9 మందితో మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులను పట్టించుకోలేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా.. ముందుగా ఎంజీఎం మహిళా సిబ్బంది అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు అందరూ ప్రభుత్వం గెలుపుకు కారణం అయినందుకు మీరందరికి చెప్పినట్లుగానే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మీరు నర్సింగ్ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుని పేషంట్లకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని…
హనుమకొండ నగరంలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది..హనుమకొండ జిల్లా భీమారంలోని శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.
ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల బడ్జెట్లో రూ.900ల కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 337 ఎకరాల భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి చుట్టూ ట్రెంచ్ కొట్టించింది.
ప్రముఖ విద్యావేత్త సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసారు. ప్రెసిడెంట్ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఉమెన్స్ డే రోజున ఈ ప్రకటన వెలువడడం విశేషం.
నేడు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును(నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేయబడింది. ఇందులోని ప్రయాణీకులందరికీ పూర్తి ఛార్జీ వాపసు చేయబడుతుందని అధికారులు ప్రకటించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి మహిళలను ప్రోత్సహించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం.