ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌కు మెట్రోను పొడిగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ లో చేదు అనుభవం ఎదురైనా…మీరు నన్ను ఆదరించారన్నారు. ఎల్బీ నగర్ లో నాకు 30 వేల మెజార్టీ ఇచ్చి మల్కాజిగిరి ఎంపీ గా గెలిపించారన్నారు. మీ అభిమానం తోనే తెలంగాణ కు ముఖ్యమంత్రి అయ్యానని, ఎల్బీ నగర్ కు…
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో చెట్ట పట్టాలు వేసుకోని తిరుగుతున్నాడని, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకీ వెళ్తాడంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. మోడీనీ పెద్దన్న అన్నప్పుడే తెలిసిపోయిందని, మోడీ అపాయింట్ మెంట్ రేవంత్ రెడ్డికీ ఈజీగా దొరుకుతుందన్నారు బాల్క సుమన్. పార్లమెంట్ ఎన్నికల ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే , హేమంత్ బిశ్వశర్మ కావడం ఖాయమన్నారు బాల్క సుమన్. బేగంపేట విమానాశ్రయంలో గురు…
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ఆయా పార్టీల అధినేతలు జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోడీ, బీజేపీ, టీడీపీ, జనసేన దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రధాని మోడీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. బీజేపీతో టీడీపీ-జనసేన కలిసి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడానికి సహాయం…
రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఇవ్వనటువంటి విద్యుత్ నీ రాష్ట్ర ప్రజలకు అందించామని, రాష్ట్రంలో నిన్న విద్యుత్ 15623 మెగావాట్ల వినియోగం అయ్యిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 15497 మెగావాట్ల విద్యుత్ (30.03.2023న) నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ సరఫరా చేశామని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ విద్యుత్ సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. గత పాలకులు వాస్తవాలు పక్కన…
టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి రాజకీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటేయమని ముఖ్యమంత్రి అడుగుతుంటే.. పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. KA పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సతీసమేతంగా కలిసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మార్చి 14 నుండి మార్చి 17 వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ, గైడ్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యం లో గ్లోబల్ స్పిరుచువాలిటీ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసుధైక కుటుంబం థీమ్ తో మహోత్సవమని, కన్హా శాంతి వనం లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 15 న రాష్ట్రపతి ప్రారంభిస్తారని, మార్చి 16 న ఉప రాష్ట్రపతి పాల్గొంటారని ఆయన…
ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ 'సిద్ధం' సభ నిర్వహించనుంది. అందుకు సంబంధించి భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను మంత్రి విడదల రజని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మూడు 'సిద్ధం' సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమయ్యారు… విజయవంతం చేసారన్నారు. 3నెలల్లో 25కోట్ల మహిళలు ఇప్పటివరకు ప్రయాణం చేశారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చలు అనంతరం.. ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు.. బీజేపీతో పొత్తు ఖరారైందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులని చంద్రబాబు నేతలకు వివరించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా…