Prashanth Reddy : కేసీఆర్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి – జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్దాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికి అమలైంది ఉచిత బస్సు మాత్రమే, అది సక్రమంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కొండంత హామిలు ఇచ్చి ..గోరంత పనులు చేయడం లేదని, కేసీఆర్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఉన్నా.. రైతు బంధు సక్రమంగా విడుదల చేయలేదు. ఎన్నికలయ్యాక నాలుగేళ్లు పరిస్దితి ఏంటో రైతులు ఆలోచించాలని, ప్రజల్లో కాంగ్రెస్ పై అసహనం పెరుగుతుందని , అసహనంతో ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ను 100 ఫీట్ల లోతులో బొంద పెడ్తాం అంటున్నారన్నారు.
అంతేకాకుండా..’రేవంత్ రెడ్డికి దమ్ముంటే 100 ఫీట్ల లోతులో పాతి పెట్టు చూద్దాం. కేటీఆర్ సవాల్ విసిరితే .. 10 రోజులైనా సవాల్ స్వీకరించకుండా పత్తాలేడు. రేవంత్ రెడ్డి కి దమ్ముంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరిలో పోటీ చేయు మా కేటీఆర్ రెడీగా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మోదీకి చెంచాగిరి చేస్తున్నాడు. ఆయన బడా బాయ్.. రేవంత్ చోటా భాయ్ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. రేవంత్ తో కలిసి మాట్లాడుకుని చంద్రబాబు మోదీ దగ్గరకు వెళ్లారు. చంద్రబాబు మోదీతో పొత్తు పెట్టుకున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలైన బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇప్పటికైనా జాగ్రత్త పడాలి .. రేవంత్ రెడ్డి గందరగోళం చేసేటట్లు ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి కామారెడ్డి నియోజకవర్గం నుంచి 60వేల మెజార్టీ తీసుకొచ్చి ప్రతీకారం తీర్చుకోవాలి’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!