కేటీఆర్, హరీష్ రావు బావ బామ్మర్దులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు అన్నారు. కేసీఆర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇంజనీర్లు కాదని, రైతు రుణమాఫీ అనేది చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎవ్వరు ఎంత పెద్ద మొత్తంలో ఋణమాపి చేయలేదని, రుణమాఫీ చేసిన చరిత్ర బీఆర్ఎస్కు లేదన్నారు. 2018-23 ఎంత మందికి రుణమాఫీ చేశారో చెప్పాలని, హెల్ప్ లైన్ పెట్టుకొని…
తాజ్ మహల్ భద్రత మరోసారి విఫలమైంది. గంగాజలం అందించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం తాజ్ కాంప్లెక్స్‌లో ఓ మహిళ గంగాజలాన్ని సమర్పించి.. శివుడి ఫోటోతో కూడిన జెండాను కూడా ఎగురవేసింది. వెంటనే ఈ విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు మహిళను పట్టుకున్నారు. కాగా.. ఆ మహిళ జెండా ఎగురవేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేటీఆర్ కేసీఆర్ కాపాడుకోలేక పోతున్న నాయకులను తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటుందని, వాళ్ళను ఆపడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలలో బీఆర్ఎస్ సరైన పద్ధతిని పాటించలేదని, కేసీఆర్ వల్లనే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చినవన్నారు అద్దంకి దయాకర్. పార్టీ ఫిరాయింపుల అనేవి కేవలం తెలంగాణలోనే కాదు దేశంలోనే ఒక తంతుగా మారిందని, టీడీఎల్పీని, సీఎల్పీని మెడ్జి చేసుకున్నప్పుడు వాళ్లకు కేటీఆర్ కు,కేసీఆర్…
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. రోజు రోజుకీ రాష్ట్రంలో ప్రేరేపిత హింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు.
రేపే క్వాలిఫికేషన్ రౌండ్.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే ఆ మూడు పతకాలు దక్కాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారత్ ఖాతాలో చేరలేదు. దాంతో ఇప్పుడు అందరి ఆశలు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ ఈసారి కూడా…
వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. వివిధ సంక్షేమ శాఖలపై ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ శాఖ సమీక్ష ప్రారంభించే ముందు కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా దూరంగా కూర్చున్నావ్.. ప్రత్యేకంగా సీటు వేయాలా..? అంటూ ఆ శాఖ కార్యదర్శి సిద్దార్ధ్ జైన్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు.
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై బల్దియా కొరడా ఝళిపించింది. ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్న దుకాణాలను తొలగించారు. అబిడ్స్ నుంచి బషీర్ బాగ్ వరకు ఉన్న ఫుట్‌పాత్‌పై ఉన్న బండ్లను దుకాణాలను కూల్చివేశారు. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న జ్యూస్ బండ్లు, చాయ్ బండ్లు మిర్చి , టిఫిన్ బండ్లను తొలగించారు. ఈ సందర్భంగా… జీహెచ్ఎంసీ అధికారులతో చిరు వ్యాపారులు వాగ్వివాదానికి దిగారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు…
ఏపీ యువతకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ఆ శాఖ కార్యదర్శులు కోన శశిధర్, సౌరభ్ గౌర్ ఈ సదస్సులో వివరించారు.