Nagarjuna Sagar: జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో పది గేట్లు ఎత్తిన అధికారులు దిగువ సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు.
బంగ్లాదేశ్లో ప్రతి ఏడాది దేశం విడిచి వెళ్తున్న 2.3 లక్షల మంది హిందువులు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అతి పెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. తిరుగుబాటు తర్వాత ఛాందసవాదుల ఆధిపత్యం కారణంగా అస్థిరమైన అరాచక వాతావరణం అక్కడి హిందూ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది. వివక్ష, అణచివేతకు గురవుతున్న హిందూ జనాభా నిరంతరం తగ్గిపోతుంది. నేడు బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో హిందువుల వాటా 1951తో పోలిస్తే 14 శాతం మేర…
సచివాలయంలో సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసేందుకు దోహదపడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని టీడీసీ ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు. 2014-19లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయగా, దురదృష్టవశాత్తు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా మార్చేసింది. ప్రస్తుత డిస్పెన్సేషన్లో ఆ పరికరాలు ఏ మేరకు పనిచేస్తాయో పరిశీలిస్తుంది మరియు అవసరమైతే కొత్త వాటిని కొనుగోలు చేస్తుంది మరియు వాటిని వ్యూహాత్మక…
వైసీపీ అధినేత జగన్ నేడు బెంగళూరు నుంచి రానున్నారు. ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రైజ్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ప్రత్యర్ధుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఎల్లుండి నంద్యాల వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నంద్యాల వెళ్లి అక్కడ హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నేటి నుంచి జగన్ క్యాంప్ ఆఫీస్ లో వైసీపీ కార్యాలయం…
నేటి నుంచి జగన్ క్యాంప్ ఆఫీస్లో వైసీపీ కార్యాలయం. ఇప్పటివరకు తాడేపల్లిలో నడిచిన వైసీపీ కేంద్ర కార్యాలయం. కొత్త ఆఫీస్ నుంచే నేటి నుంచి వైసీపీ కార్యకలాపాలు. పారిస్ ఒలింపిక్స్లో నేడు సెమీఫైనల్ ఆడనున్న భారత హాకీ జట్టు. ఈ రోజు రాత్రి 10.30 గంటలకు హాకీ సెమీ ఫైనల్. జర్మనీతో తలపడనున్న భారత హాకీ జట్టు. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,570 లుగా ఉండగా.. 22 క్యారెట్ల…
ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ…
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు నెలల్లో వివిధ సైబర్ మోసాల బాధితులకు రూ.85.05 కోట్లు తిరిగి అందించింది. TGCSB డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ TGCSB , తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (TGLSA) మధ్య సహకార ప్రయత్నమే ఫలితం అని అన్నారు. ఈ ప్రయత్నాలు పెరుగుతున్న సైబర్ నేరాల వెనుక గల కారణాలను , నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్…
వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా కొనసాగింది. 11 గంటల పాటు సమావేశం సాగింది. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు.
వెలగపూడిలోని సెక్రటేరియట్లో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ కాన్ఫరెన్స్ పలు శాఖలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గంజాయి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
బంగ్లాదేశ్ ప్రధాని తండ్రి షేక్ ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహం ధ్వంసం..! బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, షేక్ హసీనా తండ్రి.. షేక్ ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వేల సంఖ్యలో యువత రోడ్ల మీదకు వచ్చిన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢాకాలో ఉన్న ప్రధాని ప్యాలెస్లోకి ప్రవేశించడంతో పాటు అక్కడ ఉన్న వస్తువులను పూర్తిగా నాశనం చేశారు. అలాగే, ఢాకా వీధుల్లో జెండాలతో…