తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనేపథ్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు…
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పతకాలను ప్రదానం చేసిన ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీకి చెందిన 18 మంది అధికారుల్లో ఇంటర్‌పోల్‌తో సంబంధం ఉన్న ఇద్దరు సీబీఐ అధికారులు కూడా ఉన్నారు. ఆరుగురు అధికారులకు విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పోలీసు పతకాలు, 12 మందికి మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీసు పతకాలు లభించాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రదీప్ కుమార్ కె,…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో మరో పెద్ద ముందడుగు వేయనుంది. SSLV D3 రాకెట్ ప్రయోగానికి రేపు తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్ డౌన్ షురూ కానుంది. ఆరున్నర గంటల పాటు కౌంటర్ ప్రక్రియ కొనసాగనుంది.
ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలో ఒక మిలియన్ టన్ను (ఎంఎన్టి) లిక్విడ్ స్టీల్ ఉత్పత్తితో మైలురాయిని సాధించింది. భారతదేశపు ప్రభుత్వ రంగ ఉక్కు తయారీకి సరికొత్త ప్రవేశంగా, NSL అధిక-నాణ్యత ఉక్కు ఉత్పత్తులను అందించగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది , పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పడం ద్వారా బలీయమైన ప్లేయర్‌గా స్థిరపడిందని కంపెనీ పత్రికా ప్రకటన గురువారం తెలిపింది. ఆగస్ట్ 12, 2023న, NSL ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్‌లోని అధునాతన 3 MTPA స్టీల్ ప్లాంట్‌లో…
తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర సాయుధ యోధులకు అమరవీరులకు నివాళులు.. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ వచ్చిన సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం రోజున సీతారామ ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభం చేయడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో బిజీ కొత్తూరు సీతారామ పంప్ హౌస్ నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జన్మ ధన్యమైందన్నారు. ప్రాజెక్టు నిర్దిష్ట లక్ష్యంగా ఉన్న ఆయకట్ట భూములకు ఎంత ఖర్చైనా…
తొందర్లోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ తరుపున రాజయ్య భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారన్నారు. హై కోర్ట్ లో కేసు తీర్పు రిజర్వ్ లో ఉందని, ఈ తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడడం ఖాయమని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప…
స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.
జమ్మూకశ్మీర్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఉక్రెయిన్ ఎదురుదాడికి రష్యా వణికిపోయింది. గత ఎనిమిది నెలల్లో పుతిన్ బలగాలు ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకున్నంత రష్యా భూమిని చిన్న దాడితో ఎనిమిది రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ దాడితో ఆగ్రహానికి గురయ్యాడు. శత్రువులను తరిమికొట్టడానికి కుర్స్క్‌కు మరిన్ని దళాలను మోహరించాలని క్రెమ్లిన్‌కు పిలుపునిచ్చారు.