Gwalior Shocker: తల్లిదండ్రుల ప్రేమను ఈ ప్రపంచంలో దేనితోనూ పోల్చలేరు, ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేరు. ఈ సంబంధం అన్ని ఇతర బంధాల కంటే మించి ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏదైనా చేయగలరు. తల్లిదండ్రుల ప్రేమ ముందు సంపద, కీర్తి అన్నీ దిగదుడుపే. అయితే ఈ బంధానికి మచ్చ తెచ్చే ఉదంతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని కన్నకూతురినే కడతేర్చాడు ఓ తండ్రి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మరో కులానికి చెందిన యువకుడితో సంబంధానికి సంబంధించి ఒక వ్యక్తి తన కుమార్తెతో గొడవపడి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Rachakonda Police: నాలాలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు..
గిర్వాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) గజేంద్ర సింగ్ వర్ధమాన్ తెలిపారు. ఆ వ్యక్తి కూతురు వేరే వర్గానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉంది, అయితే కుటుంబ సభ్యులు దానిని వ్యతిరేకించారు.శుక్రవారం తండ్రీకూతుళ్ల మధ్య కులాంతర ప్రేమకు సంబంధించి గొడవ జరిగిందని, ఆ సమయంలో ఆ వ్యక్తి ఆమెను గొంతు కోసి చంపాడని పోలీసు అధికారి వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.