స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు 98 నిమిషాల పాటు తన సుదీర్ఘమైన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంతో 2016లో 96 నిమిషాల తన మునుపటి రికార్డును అధిగమించారు.
ఎవరైనా తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఓ భర్త తన భార్య అందంగా తయారై బయటకు వెళ్లడాన్ని సహించలేకపోయాడు. భార్య అందంగా తయారవడం ఇష్టం లేని ఆ భర్త అనేక సార్లు గొడవపడేవాడు. చివరకు నమ్మించి బయటకు తీసుకెళ్లి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని విన్నారు. గతంలో ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడం ఇదే తొలిసారి.
రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 4 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తు లో ఉంటారన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు గోల్కొండ కోటలో ప్రభుత్వం తరఫున అధికారిక వేడుకలు జరుగనున్నాయన్నారు. ఇదిలా…
“నిందితులను రక్షించే ప్రయత్నం”.. కోల్‌కతా డాక్టర్ ఘటనలో మిత్రపక్షంపై విమర్శలు.. కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ నేతలు మెల్లిగా స్పందిస్తున్నారు. ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాత ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బాధితురాలికి న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే…
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. అమెరికా పర్యటనలో రూ.31502 కోట్ల పెట్టుబడులు రాగా.. చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే స్పందన వెల్లువెత్తింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు ముందుకు వచ్చాయి. రూ.4500 కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.…
తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ బుధవారం నామినేట్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ. మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉన్నందున, సింఘ్వీకి సీటు కోసం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ తన బలంపై ఆధారపడే అవకాశం ఉంది.…
దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో 8 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని.. రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే.. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు భవనం నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న క్రమంలో…
కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చామన్నారు. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి…