తమ డిపోలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి…
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు…
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో తన తోటి బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని సాధించాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ గా కొనసాగుతున్నాడు.
పాతబస్తీ బాలాపూర్‌లో రౌడీ షీటర్ రియాజ్ హత్య కేసును బాలాపూర్ పోలీసులు ఛేదించారు. ఈనెల 9వ తేదీన బాలాపూర్ ARCI రోడ్డుపై రియాజ్ పై కాల్పులు జరిపి హతమార్చింది సూపారీ గ్యాంగ్. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాలాపూర్ లో జరిగిన గ్యాంగ్ స్టర్ రియాజ్ హత్య కేసును ఛేదించామని, ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ చేశామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రధాన నిందితుడు హమీద్ పరారీలో ఉన్నాడని…
మైనర్ బాలికను లాడ్జికి తీసుకెళ్లి యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. వీడియో కూడా తీశాడు. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో జరిగింది. ఆగస్టు 8న ఓ లాడ్జికి తీసుకెళ్లి మైనర్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు లైంగిక దాడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో పెట్టగా, చాలా మంది ఇతర గ్రూపుల్లో షేర్ చేశారు.
ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 8:30 గంటలకు గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు. 9.20 గంటలకి పరేడ్ గ్రౌండ్ చేరుకొని సైనికుల స్మారకానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వాతంత్య్ర వేడుక సంబురాల్లో పాల్గొని.. అనంతరం…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకుల హాస్టల్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రతి జిల్లా కలెక్టరు, శాననసభ్యులు, విద్యశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక నిధులతో ప్లాంటేషన్ పనులను పూర్తిచేయాలని ఆదేశించామని,…
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
గాంధీ ఆస్పత్రిలో కోల్‌కతా హత్యాచార ఘటనకు నిరసన చేపట్టిన వైద్యులకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు. ఓ రోగిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి సీతక్క.. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించాలని వ్యాఖ్యానించారు.