పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్.. ఇప్పుడు పాకిస్థాన్‌లో స్టార్‌గా మారాడు. పాకిస్తాన్‌లోని ప్రతి మీడియా అర్షద్‌ను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటుంది. దేశానికి స్వర్ణం సాధించిన అర్షద్‌పై అవార్డుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ఓ టీవీకి నదీమ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తనకు బహుమతిగా ఇచ్చిన మామపై జోక్ వేశాడు. గేదెను బహుమతిగా ఇచ్చే బదులు.. భూమి ఇవ్చొచ్చు కదా అన్నీ ఫన్నీగా అన్నాడు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశం. కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం? అని ఆయన వ్యాఖ్యానించారు. ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ…
చైనా చాలా కాలంగా జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన చైనా ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా రేటును పెంచడానికి చైనా అనేక చర్యలు తీసుకుంటోంది.. జనాభాకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం చిట్ చాట్.. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా.. అది ఎప్పటికీ జరుగి తీరుతుందని అన్నారు. విలీనం అయిన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్రమంత్రి పదవి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు. విలీనం,…
ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అనుమతి నిరాకరించింది. దీంతో.. ఐసీసీ ( ICC) కొత్త వేదిక కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో.. యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ఈ టోర్నీని అక్కడ నిర్వహించడం కష్టంగా మారింది.
రుణమాఫీ అంతా బోగస్ అని తేలిపోయిందని, స్వతంత్ర భారతదేశంలో నే ఇది అతి పెద్ద మోసమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకే సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారని, రైతులను రేవంత్ రెడ్డి అడ్డంగా మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ప్రతి రైతు కు రుణమాఫీ చేస్తాము అన్నారని, రేషన్ కార్డు కావాలని చెప్పలేదన్నారు కేటీఆర్. వెంటనే వెళ్లి రెండు లక్షలు తెచ్చుకోండి అన్నారని, నలభై వేల కోట్లు…
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ గేమ్స్‌లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో సమావేశమయ్యారు. అథ్లెట్లందరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.. అక్కడ వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టుతో మాట్లాడి వారిని ప్రశంసించారు. భారత రిటైర్డ్ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్…
హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్స్ గురించి నిజం తెలుసుకోవాలని అతని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇంతలో.. సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న జాస్మిన్ పక్కనే హార్దిక్ పాండ్యా చేతిని చూడవచ్చు. ఇంతకుముందు వీరిద్దరి ఫోటోలు ఒకే లొకేషన్ చూసి ఊహాగానాలు అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ ఫోటోను చూసిన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో హార్దిక్ పై తీవ్రంగా టోల్స్ చేస్తున్నారు. తాజాగా.. సోషల్ మీడియాలో వచ్చిన…
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ బోగస్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. 59 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, రైతులకు దగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు దగా, మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా…
కోల్ కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళన కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. CBI కేసును వేగవంతం చేయాలన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిండుతుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని దామోదర్ రాజనర్సింహ కోరారు. ఉస్మానియా ,…