నంద్యాల పట్టణ శివారులో వక్ఫ్ బోర్డ్ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి కూల్చడానికి వెళ్లిన అధికారుల బృందానికి చుక్కెదురైంది. ఆ ఇంటి యజమాని తన ఇంటిని కూలిస్తే చనిపోతానని బెదిరించాడు. కూల్చడానికి సిద్ధమవుతున్న తహసీల్దార్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఇంటి యజమాని ఉరుకుంద.
సెప్టెంబర్ 17వ తేదీన గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, బాలాపూర్ రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం.. ఇదొక్కటి కాదు చిన్న చిన్నవి నిమజ్జనానికి వెళ్లేలా జోనల్ కమిషనర్ లు అన్ని పరిశీలిస్తున్నారమన్నారు. GHMC, కలెక్టర్ రోడ్డు రిపైర్స్, రోడ్డుగా అడ్డంగా ఉన్న చెట్లు , వైర్లు తొలిగించారని, నిమజ్జనాల…
ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు కూడా ఏ టోర్నీ కోసం ఇండియాకు వెళ్లదని అని అన్నాడు.
తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే.. ఇది మీ కోసమే. 5 గొప్ప కంపెనీలకు సంబంధించిన రూ.15 వేల రేంజ్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి. అందులో.. సాంసంగ్, ఎల్జీ లాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ టీవీలలో మీరు డాల్బీ ఆడియోతో క్లారిటీ స్క్రీన్‌ను పొందుతారు.
రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా నేతన్నలు శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో నేత కార్మికులకు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. 8 కోట్ల మీటర్ల బట్టతో చీరెలు ప్రభుత్వం నుండి ఆర్డర్ నేతన్నలు ఇస్తున్నామని, నేత కార్మికులకు భవిష్యత్‌లో hiit ద్వారా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.…
రూ. 2వేల పందెం కోసం మున్నేరులో దూకిన యువకుడు గోపిచంద్ మృతదేహం లభ్యమైంది. ఘటన జరిగిన 6 రోజుల తర్వాత గోపిచంద్ మృతదేహం దొరికింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గల మున్నేరులో గోపిచంద్ గల్లంతైన సంగతి తెలిసిందే.
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆదిలాబాదు నుండి ఖమ్మం వరకి పాదయాత్ర చేసానని, మీ అందరి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజల ఆశయాలని చట్టాలుగా మార్చి పని చేస్తుంది మా ప్రభుత్వమని, ప్రాజెక్టుల కొసం భూములని ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాలి.అందుకే నిధులు విడుదల చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. రెండు లక్షలు రుణమాఫి చేస్తానని మాట ఇచ్చాం చేసి చూపామని, హామీ ఇవ్వకున్నా 2 లక్షల పైన ఉన్న…
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అండర్‌పాస్‌లో నీరు నిలిచి ఉండటంతో.. అది గమనించని ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నీరు నిలిచిపోవడంతో వారి ఎస్యూవీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వారు బయటకు రాలేక కారులోనే ఉండటంతో ఊపిరాడక మరణించారని పోలీసులు శనివారం తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకుని టీ తాగిన వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ విక్టరీ సాధించింది. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఇప్పటికే వరుస విజయాలతో సెమీస్‌కు చేరిన భారత్.. నామమాత్రపు మ్యాచ్‌లో పాకిస్తాన్ ను ఓడించింది. 2-1 ఆధిక్యంతో గెలుపొందింది.