Botsa Satyanarayana: ప్రస్తుతం రాష్ట్రమంతా ఒక సమస్యపై దృష్టి పెట్టిందని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం విధానానని స్పష్టం చేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. జాతీయంగా ఉంచుతారా, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతారో చెప్పాలన్నారు. ఉక్కు మంత్రి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ చూశారు.. ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు ప్రజలకు సంబంధించిందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి మేము సిద్ధమని ఆయన చెప్పారు. ప్రజా ప్రతినిధుల రాజీనామాల వల్ల ఉపయోగం లేదన్నారు.
Read Also: Lorry Incident: కూరగాయల షాపులోకి దూసుకెళ్లిన లారీ.. నుజ్జునుజ్జయిన ద్విచక్రవాహనాలు
వైసీపీ ప్రభుత్వం హయాంలో మేం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని కేంద్రానికి చెప్పడం వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదన్నారు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మా వల్ల ఆగిందని బొత్స పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రంలోని ఎన్డీఏకు బలం ఎక్కువ ఉందని.. ఎన్డీఏలో భాగస్వామిగా వున్న చంద్రబాబు ఈ ప్రైవేటీకరణ ఆపాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ప్రైవేటీకరణకు ఎందుకు అడుగులు పడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా మేము పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.